సాక్షి, ముంబై : వరుసగా ఏడవ సెషన్‌లో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ లాభాలనుంచి వెంటనే నష్టాల్లోకి మళ్లిన సూచీలు మిడ్ సెషన్‌నుంచి మరింత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రభావితమైంది. దీంతో సెన్సెక్స్ 700 పాయింట్లు కుప్పకూలగా,నిఫ్టీ 193 పాయింట్లు క్షీణించింది. బ్యాంకు నిఫ్టీ కూడా 770 పాయింట్లు పతనమైంది. తద్వారా సెన్సెక్స్ 38 వేల స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో ఇంట్రే డే హై నుంచి 1298 పాయింట్లు పతనం కావడం గమనార్హం. యస్ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, గెయిల్, హీరో మోటోకార్ప్ భారీగా నష్టపోగా, ఐషర్ మోటార్స్, హెచ్‌సిఎల్ టెక్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ ,టెక్ మహీంద్ర లాభపడుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 200 పాయింట్లకు పైగా రికవరీనా సాధించాయి. అయితే ఆఖరి గంట ట్రేడింగ్ కీలకం.
Comments
Please login to add a commentAdd a comment