సాక్షి, ముంబై : కోవిడ్-19 ప్రపంచమార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. కరోనా వైరస్ వ్యాధి భయాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో భారీ పతనం నమోదైంది. శుక్రవారం ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం కోలుకోని కీలక సూచీలు మరింత పతనమయ్యాయి. సెన్సెక్స్ 1300 కుదేలైన సెన్సెక్స్ ప్రస్తుతం 39 వేల దిగువకు చేరి 38545 వద్ద, నిఫ్టీ 356 పాయింట్లు క్షీణించి 11276 వద్ద కొనసాగుతోంది. తద్వారా 11300 దిగువకు చేరింది. అన్నిరంగాల్లోనూ అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి. అత్యధికంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సైతం 2.50 శాతం నష్టంతో 25వేల దిగువకు చేరింది. దీంతో అయిదే అయిదు నిమిషాల్లో సుమారు రూ. 4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద, మార్కెట్ క్యాప్ రూ. 5 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ.150 లక్షల కోట్లకు పడిపోయింది. మొత్తంగా ఆరు రోజుల వరస నష్టాలతో దలాల్ స్ట్రీట్‌లో రూ.10 లక్షల కోట్లు సంపద హరించుకుపోయింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారిన కోవిడ్-10 మహమ్మారిని నియంత్రించకపోతే..గణనీయమైన ప్రతికూల ప్రభావం ఉండనుందని గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ సంస్థ జెఫెరీస్ విశ్లేషించింది. ముఖ‍్యంగా దక్షిణ కొరియా, ఇటలీ , ఇరాన్‌లో ఈ వైరస్ విస్తరించడం ప్రమాదాన్ని సూచిస్తోందని పేర్కొంది. అటు డాలర్ మారకంలో రూపాయి కూడా ఇదే బాటలో వుంది. నిన్నటి ముగింపు 71.55 తో పోలిస్తే 38 పైసలు బలహీనపడి 71.93 వద్ద వుంది.
Comments
Please login to add a commentAdd a comment