ప్రపంచంలో యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్ జులైలో రష్యా నుంచి 2.8 బిలియన్ డాలర్ల(రూ.23.5 వేలకోట్లు) క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంది. చైనా తర్వాత రష్యా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలిచింది.
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిలో ట్రేడ్ చేసుకునేందుకు వీలుకల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది.
ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు
రష్యా క్రూడ్ ఎగుమతుల్లో 47 శాతం చైనా కొనుగోలు చేయగా, భారత్ (37 శాతం), యురోపియన్ యూనియన్ (7 శాతం), టర్కీ (6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) ఒక నివేదికలో తెలిపింది. చమురుతోపాటు బొగ్గును కూడా అధికంగానే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సీఆర్‌ఈఏ తెలిపింది. చైనా సైతం రష్యా బొగ్గును భారీగానే వాడుతోంది. డిసెంబర్ 5, 2022 నుంచి జులై 2024 చివరి వరకు రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారతదేశం (18 శాతం), టర్కీ (10 శాతం), దక్షిణ కొరియా (10 శాతం), తైవాన్ (5 శాతం) కొనుగోలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment