russai
-
40 శాతం పెరిగిన క్రూడ్ దిగుమతులు.. అయినా భారత్‌కు మేలే!
ప్రపంచంలో యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్ జులైలో రష్యా నుంచి 2.8 బిలియన్ డాలర్ల(రూ.23.5 వేలకోట్లు) క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంది. చైనా తర్వాత రష్యా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలిచింది.ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిలో ట్రేడ్ చేసుకునేందుకు వీలుకల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలురష్యా క్రూడ్ ఎగుమతుల్లో 47 శాతం చైనా కొనుగోలు చేయగా, భారత్ (37 శాతం), యురోపియన్ యూనియన్ (7 శాతం), టర్కీ (6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) ఒక నివేదికలో తెలిపింది. చమురుతోపాటు బొగ్గును కూడా అధికంగానే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సీఆర్ఈఏ తెలిపింది. చైనా సైతం రష్యా బొగ్గును భారీగానే వాడుతోంది. డిసెంబర్ 5, 2022 నుంచి జులై 2024 చివరి వరకు రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారతదేశం (18 శాతం), టర్కీ (10 శాతం), దక్షిణ కొరియా (10 శాతం), తైవాన్ (5 శాతం) కొనుగోలు చేశాయి. -
గగనతల రారాజు ‘జిర్కాన్’.. ఎన్నో ప్రత్యేకతలు
రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరేలాగా తాజా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రష్యా అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా కీవ్ ఫోరెన్సిక్ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది. ఇటీవల కీవ్‌పై జరిగిన ఒక దాడిలో రష్యా జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది. జిర్కాన్ ప్రత్యేకతలు.. ఒక్కసారి జిర్కాన్ క్షిపణి గాల్లోకి ఎగరడం మొదలుపెడితే దాన్ని ప్రపంచంలోని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు. అమెరికాకు చెందిన మిసైల్ డిఫెన్స్ అడ్వొకసి అలయన్స్ అంచనా ప్రకారం ఈ క్షిపణి గంటకు 9,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకవేళ ఇలా వస్తున్న వార్తలు నిజమైతే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి జిర్కాన్. దాన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఈ క్షిపణి ప్రయాణించే సమయంలో దాని చుట్టూ ప్లాస్మా మేఘంతో వలయం ఏర్పడుతుంది. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి వచ్చే రాడార్ సంకేతాలను అది తనలో కలిపేసుకుంటుంది. దీంతో ఈ క్షిపణిని గుర్తించడానికి వీలుండదు. అమెరికాకు చెందిన ‘ఏజిస్ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం. ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందువల్ల ఏజిస్ క్షిపణికి కూడా అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్‌లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్‌కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్‌కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్‌ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్‌గా ఉందని తెలిపారు. -
వీచాట్, క్యాస్పర్స్కైపై నిషేధం.. కారణం ఇదే..
కెనడా ప్రభుత్వం చైనా మెసేజింగ్ అప్లికేషన్ వీచాట్‌ను, రష్యన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ కాస్పర్స్కైను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీచాట్ యాప్ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే యాప్స్‌లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దక్షిణాసియా వాసులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. వీచాట్ యాప్ నుంచి కీలకమైన డేటా లీక్ అవుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. రిస్క్‌ను అంచనావేసి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పరికరాల నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించినట్లు కెనడా ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు అనితా ఆనంద్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై వీచాట్ యజమాని అయిన టెన్సెంట్ సంస్థ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన క్యాస్పర్స్కైపై కూడా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. దాంతో కంపెనీ వర్గాలు మాట్లాడుతూ కెనడా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని, నిరాశను కలిగించిందని తెలిపాయి. ప్రభుత్వ ఆందోళనలను పరిష్కరించడానికి సంస్థకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ రెండు అప్లికేషన్లను డౌన్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
జయహో భారత్..!!
-
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
-
ఉక్రెయిన్ పరిస్థితులపై సాక్షి ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
-
సేవకు చూపు అడ్డుకాదు.. అంధుడికి సేవకు సలాం
-
రష్యా vs ఉక్రెయిన్: మారియుపోల్ మారణహోమం..!!
-
ఉక్రెయిన్ కు అమెరికా భారీ సాయం
-
మార్కెట్ క్యాప్.. ఆవిరి..
-
రష్యన్ చమురు కంపెనీలు భారత్ కు భారీ బంపర్ ఆఫర్..!!
-
పదిరోజుల్లోనే రష్యాకు ముచ్చెమటలు!
-
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం సీఎం జగన్ ప్రత్యేక చర్చలు
-
ఎట్టకేలకు రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్
-
అలా చేస్తే మర్యాద దక్కదు.. ఉక్రెయిన్ కు రష్యా వార్నింగ్
-
భారీ ఎదురుదెబ్బ.. రష్యన్ మేజర్ జనరల్ హతం
-
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ కీలక పాత్ర
-
ప్రధాని అత్యున్నత సమావేశం.. ఉక్రెయిన్ కు భారత్ విమానాలు
-
ఉక్రెయిన్ లో యుద్ధం ఎలా జరుగుతుందో లైవ్ లో చెప్పిన విద్యార్ధి
-
థర్డ్ వరల్డ్ వార్ సంకేతాలు ఇవేనా ??
-
ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులపై కీలకమైన ఆర్డర్స్
-
తెలుగు విద్యార్థులు పరిస్థితి ఎలా ఉంది ??
-
ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్థులకు శుభవార్త
-
కీవ్ కి 15 కి.మీ దూరంలో పరిస్థితి ఎలా ఉందంటే ??
-
ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర పరిస్థితి
-
భారత్‌కు దౌత్య సిబ్బంది కొరత..!
అంతర్జాతీయ స్థాయిలో నిర్దేశిత లక్ష్యాలు, ఆకాంక్షలను నెరవేర్చుకునే క్రమంలో భారత్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రపంచంలో స్థిరమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న దేశాల్లో ముందు వరసలో ఉన్న మనదేశానికి దౌత్య సిబ్బంది కొరత ఓ ముఖ్య సమస్యగా మారింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత స్థానం, న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూప్‌లో సభ్యత్వం, వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయుల హక్కుల పరిరక్షణ వంటి ఇతర సమస్యలు ఎదురైనపుడు ఇదొక ప్రతిబంధకమైంది. వివిధ అంశాల్లో సహకారం, తదితరాల విషయంలో ఆసియా ఖండంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియాను అమెరికా, ఇతర పశ్చిమదేశాలు ఎంచుకుంటున్న నేపథ్యంలో సరైన సంఖ్యలో దౌత్యసిబ్బంది అందుబాటులో లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. ప్రపంచంలోనే ఓ ఆర్థికశక్తిగా ఎదుగుతున్న క్రమంలో ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకునేందుకు ఆయా దేశాల్లో తగినంతగా రాయబార కార్యాలయ సిబ్బంది అవసరం ఎంతైనా ఉంది. విస్తీర్ణం, వైశాల్యపరంగానే కాకుండా 130 కోట్లకు పైగా జనాభాతో రెండో అత్యధిక జనాభా దేశంగా ఉన్న భారత్‌కు 940 విదేశీ సర్వీసు అధికారులున్నారు. ఓ మోస్తరు పెద్ద దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. చిన్నదేశాలైన సింగపూర్‌కు (దాదాపు 58 లక్షల జనాభా) 850 మంది అధికారులు, న్యూజిలాండ్‌కు (50 లక్షల జనాభా) 885 మంది అధికారులున్నారంటే మనదేశ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక పెద్ద దేశాలైన చైనాకు ఏడున్నరవేల మంది, అమెరికాకు 14 వేల మంది, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు 6 వేలకు పైగా దౌత్యాధికారులున్నారు. ఈ కొరత కారణంగా రక్షణ, ఆర్థిక, ఇతర శాఖల అధికారులు, నిపుణులను డిప్యుటేషన్‌పై తెచ్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. స్పానిష్ భాష మాట్లాడే అధికారుల కొరత కారణంగా అనేక లాటిన్ అమెరికా దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు. విదేశాల్లోని అనేక దౌత్యకార్యాలయాలు అతి తక్కువ మంది అధికారులు, సిబ్బందితో పనులు చక్కపెట్టాల్సి వస్తోంది. గతంలో ఓ మంత్రిత్వశాఖలో స్టెనోగ్రాఫర్‌గా ఉన్న వ్యక్తిని ఉత్తర కొరియా రాయబారిగా నియమించాల్సి వచ్చిందంటే మనదేశ పరిస్థితి స్పష్టమవుతోంది. ప్రతిభగలవారు విదేశీ సర్వీసుకు బదులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి సర్వీసులను ఎంచుకుంటున్నారు. పోలీస్ లేదా కస్టమ్స్ శాఖలో చేరే అవకాశాన్ని కోల్పోయిన వారే ఈ సర్వీస్ ఎంచుకుంటున్నారు. గత నాలుగేళ్లలో అమెరికా, చైనాల్లో ఐదేసి సార్లు, రష్యా, జర్మనీల్లో నాలుగేసి సార్లు కలుపుకుని ప్రధాని నరేంద్రమోదీ దాదాపు 60 దేశాల్లో పర్యటించారు. అయితే ఈ దేశాల్లో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించేందుకు, పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రణాళికలు అమలు చేసేందుకు అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాతకాలం నాటి ఎంపిక విధానానికి బదులు, దౌత్యసిబ్బంది నియామక ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చి పరిమిత కాలానికి కన్సల్టెంట్లు, నిపుణులను నియమించుకునేలా మార్పులు చేయాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో దేశం అవసరాలు, మారుతున్న కాలానికి తగ్గట్టుగా పునర్వ్యవస్థీకరణతో పాటు కీలక మార్పులు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. -
2024 వరకూ ఆయనే...
మాస్కో : రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం అర్ధరాత్రి 11.30 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. దాదాపు 99.9శాతం బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయినట్టు, లెక్కించిన ఓట్లలో పుతిన్ 76.67శాతం ఓట్లను సాధించినట్లు రష్యా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది నాల్గోసారి. 2000 సంవత్సరంలో ప్రారంభమైన పుతిన్ రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో గెలుపోందటంతో 2024 వరకూ కొనసాగనుంది. 2012 వరకూ రష్యాలో అధ్యక్షుడి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు మాత్రమే. కానీ 2012లో పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదవీ కాలాన్ని నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు పొడిగించారు. రష్యాను అత్యధిక కాలం పాలించిన నియంత జోసఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉన్న నాయకుడుగా పుతిన్ రికార్డు నెలకొల్పనున్నారు. పుతిన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన నేత లేకపోవడం, పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంతో ఏకపక్షంగా ఫలితం వచ్చింది. -
మద్యం మత్తులో భర్తను రేపిస్టుగా భావించి..!
మాస్కో: మద్యం మత్తులో భర్తను దెయ్యంగా భావించిన ఓ మహిళ మూడో అంతస్తు నుంచి దూకేసింది. దెయ్యం తనను రేప్ చేసి చంపేస్తుందేమోనన్న భయంతో ఈ చర్యకు పాల్పడింది. రష్యాలోని తులున్ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. మద్యాన్ని సేవించిన ఆ మహిళకు తన గది తలుపును కొడుతున్న చప్పుడు వినిపించడంతో భయపడింది. తలుపు వెనుక ఉన్నది దెయ్యం అయి ఉంటుందని, అది తనను అత్యాచారం చేసి.. చంపడానికి వచ్చిందని ఆమె భయపడింది. అంతే ఆ దెయ్యం నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు కిటికీ నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో కిటికీ నుంచి ఆమె జారి మంచులో పడిపోయింది. స్థానిక టీవీ కంపెనీ ప్రతినిధులు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. అసలు ఏమైందని ఆమెను వైద్యులు ఆరా తీయగా.. తలుపు బయట ఉన్న వ్యక్తి దెయ్యం అయి ఉంటుందని, అది తనపై దాడి చేసేందుకే వచ్చాడని తనకు అనిపించిందని, అందుకే తాను కిటికీ నుంచి దూకేశానని ఆమె తెలిపింది. 'వారం రోజులుగా నిరాటంకంగా మద్యాన్ని తాగుతుండటంతో ఆమెలో మానసిక సమస్య తలెత్తింది. అందుకే తాగిన మత్తులో కిటికీ నుంచి దూకేసింది. నిజానికి ఆ సమయంలో ఆమె భర్త ఆఫీసు నుంచి మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చాడు. అతడిని ఆమె దెయ్యంగా భావించింది' అని పోలీసు అధికార ప్రతినిధి ఇగర్ మార్దాటినెంకో తెలిపారు.