న్యూఢిల్లీ: ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్‌కు ముడి చమురును చౌకగా అందుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రష్యా నుంచి జరుపుతున్న చమురు దిగుమతుల్లో కాస్త మార్పులు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు రష్యా ఆఫర్ చేసిన ధరకు కాకుండా చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువకు భారత్ అమ్మాలని రష్యాను కోరింది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో పలు దేశాల ఆంక్షల రష్యా పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఒపెక్( ఓపీఈసీ) దేశాల నుంచి రిస్క్‌ను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈ మేరకు ప్రతిపాదన చేసింది. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఒక బ్యారెల్ ధర సుమారు 108 డాలర్లు ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వ, ప్రైవేట్ ఆయిల్ సంస్థలు రష్యా రాయితీ ప్రకటించడంతో 40 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును కొనుగోలు చేశాయి. 2021లో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసిన దాని కంటే ఇది 20 శాతం అదనమని గణాంకాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యం కారణంగా.. ఆయిల్ వ్యాపారం రష్యాకు మరింత కఠినంగా మారింది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరో కొనుగోలుదారుడితో తమ వ్యాపార లావాదేవీలు అంత సులువుగా రష్యా జరపలేదు. ఈ సమయంలో రష్యా నుంచి జరుపుతున్న దిగుమతుల కారణంగా భారత్ భవిష్యత్తులో వాణిజ్య పరంగా ఇతర దేశాలతో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువకు చమురును అమ్మాలని రష్యాను భారత్ కోరుతోంది. కాగా ఈ ప్రతిపాదనకు రష్యా నుంచి ఎలా స్పందన రాబోతోందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment