ఏ వింత వ్యాధినైనా ముందుగా చైనా నాంది పలుకుతోంది. అది అపోహకాదని ఇటీవల వెలుగుచూసిన కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత కాలుష్యం చైనాలో ఉందట. ఈ కింది ఫొటోలు చూస్తే మీకేతెలుస్తుంది.
విపరీతమైన కాలుష్యకోరల్లో చిక్కుకున్న ఓ నదిలో తేలియాడుతున్న బారీ చేప కళేబరంఇది. కేవలం చేపలేకాదు సమస్త జీవాలన్నీ ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ కేవలం కాలుష్యం మూలంగానే మరణించాయి. ఈ రైతు ముఖంలో వేదన ఈ ఫొటోలో క్లియర్‌గా చూడొచ్చు.
మూడింట రెండు వంతుల చైనాలోని నగరాలు వాయు ఉద్గార ప్రమాణాలను పాటించడం లేదు.
చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!
కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు అక్రమంగా జియాన్హే నదిలో విడుదల చేయడం వల్ల పూర్తిగా కాలుష్యమై నీరు ఎర్రగా మారిపోయిన చిత్రమిది.
ఝుగావో సిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న నది ఇది.
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త వేయడానికి చోటు ఎక్కడా లేకపోవడంతో ఆచెత్తంతా నదిలో కలుస్తుంది.
చైనాలోని 560 మిలియన్ పట్టణ వాసుల్లో కేవలం 1% మంది మాత్రమే యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు.
చాలా సార్లు విపరీతమైన వాయు కాలుష్యంమూలంగా స్కూళ్లు, ఆఫీసులకు సెలవు కూడా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.
చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!!
ఫుయువాన్ నదిలోని కాలుష్య నీటిని తాగుతున్న చిన్నారి.
చైనాలో అందుబాటులో ఉన్న నీటి వనరులన్నింటినీ 2030నాటికల్లా అక్కడి ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తిగా నాశనం చేయనున్నాయి.
సముద్రంలోకి విడుదలౌతున్న ఉద్ఘారాలను అక్కడి ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు.
గత జనవరి 12న అక్కడి వాయు నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా కొలవలేకపోయింది.
ప్రతి ఏటా 7 లక్షల 50 వేల మంది కేవలం వాయుకాలుష్యం మూలంగానే మరణిస్తున్నారు.
2010 లో ఒక చమురు నిల్వ కేంద్రంలో సంభవించిన పేలుడు వల్ల దాదాపు 400 మిలియన్ గ్యాలన్ల చమురు లీక్ అయ్యింది. అది మెక్సికోలో సంభవించిన బీజీ ఆయిల్ స్పిల్ కంటే 4 రెట్లు ఎక్కువ.
కాలుష్యం వల్ల 2012లో 2,589 మంది బీజింగ్ ప్రజలు మరణించారు.
ఇప్పటికే 90% చైనా భూగర్భజలాలు కలుషితమైపోయాయి.
ప్రపంచంలోనే 30 అత్యంత కలుషిత నగరాల్లో 20 నగరాలు చైనాకు చెందినవే.
ప్రపంచంలోని సగం బొగ్గును చైనానే వినియోగిస్తోంది.
2030 నాటికల్లా చైనా విడుదల చేసే కార్భన్‌డైఆక్సైడ్ ప్రపంచం మొత్తం కాలుష్యంతో సమానమౌతుందని ఒక అంచనా.
చదవండి: Wonder of Science: బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!
Comments
Please login to add a commentAdd a comment