River Water dispute
-
Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు!
ఏ వింత వ్యాధినైనా ముందుగా చైనా నాంది పలుకుతోంది. అది అపోహకాదని ఇటీవల వెలుగుచూసిన కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత కాలుష్యం చైనాలో ఉందట. ఈ కింది ఫొటోలు చూస్తే మీకేతెలుస్తుంది. విపరీతమైన కాలుష్యకోరల్లో చిక్కుకున్న ఓ నదిలో తేలియాడుతున్న బారీ చేప కళేబరంఇది. కేవలం చేపలేకాదు సమస్త జీవాలన్నీ ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ కేవలం కాలుష్యం మూలంగానే మరణించాయి. ఈ రైతు ముఖంలో వేదన ఈ ఫొటోలో క్లియర్‌గా చూడొచ్చు. మూడింట రెండు వంతుల చైనాలోని నగరాలు వాయు ఉద్గార ప్రమాణాలను పాటించడం లేదు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు అక్రమంగా జియాన్హే నదిలో విడుదల చేయడం వల్ల పూర్తిగా కాలుష్యమై నీరు ఎర్రగా మారిపోయిన చిత్రమిది. ఝుగావో సిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న నది ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త వేయడానికి చోటు ఎక్కడా లేకపోవడంతో ఆచెత్తంతా నదిలో కలుస్తుంది. చైనాలోని 560 మిలియన్ పట్టణ వాసుల్లో కేవలం 1% మంది మాత్రమే యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. చాలా సార్లు విపరీతమైన వాయు కాలుష్యంమూలంగా స్కూళ్లు, ఆఫీసులకు సెలవు కూడా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! ఫుయువాన్ నదిలోని కాలుష్య నీటిని తాగుతున్న చిన్నారి. చైనాలో అందుబాటులో ఉన్న నీటి వనరులన్నింటినీ 2030నాటికల్లా అక్కడి ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తిగా నాశనం చేయనున్నాయి. సముద్రంలోకి విడుదలౌతున్న ఉద్ఘారాలను అక్కడి ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు. గత జనవరి 12న అక్కడి వాయు నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా కొలవలేకపోయింది. ప్రతి ఏటా 7 లక్షల 50 వేల మంది కేవలం వాయుకాలుష్యం మూలంగానే మరణిస్తున్నారు. 2010 లో ఒక చమురు నిల్వ కేంద్రంలో సంభవించిన పేలుడు వల్ల దాదాపు 400 మిలియన్ గ్యాలన్ల చమురు లీక్ అయ్యింది. అది మెక్సికోలో సంభవించిన బీజీ ఆయిల్ స్పిల్ కంటే 4 రెట్లు ఎక్కువ. కాలుష్యం వల్ల 2012లో 2,589 మంది బీజింగ్ ప్రజలు మరణించారు. ఇప్పటికే 90% చైనా భూగర్భజలాలు కలుషితమైపోయాయి. ప్రపంచంలోనే 30 అత్యంత కలుషిత నగరాల్లో 20 నగరాలు చైనాకు చెందినవే. ప్రపంచంలోని సగం బొగ్గును చైనానే వినియోగిస్తోంది. 2030 నాటికల్లా చైనా విడుదల చేసే కార్భన్డైఆక్సైడ్ ప్రపంచం మొత్తం కాలుష్యంతో సమానమౌతుందని ఒక అంచనా. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
హస్తినకు రండి.. చర్చిద్దాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై మరో దఫా చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ సిద్ధమైంది. ఈ నెల 21న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల అధికారులతో కీలక భేటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ ఆర్కే కనోడియా తెలంగాణ, ఏపీలతో పాటు కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాశారు. రెండో బోర్డుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తామని తెలుపుతూ ఆరు ఎజెండా అంశాలను లేఖలో పొందుపరిచారు. కృష్ణా బోర్డును ఏపీకి తరలించడం, బోర్డుకు రాష్ట్రాల నిధుల విడుదల, కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఇరు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, నీటి నిర్వహణ, బోర్డుల పరిధి, తదుపరి అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై ఇందులో చర్చిద్దామని ప్రతిపాదించింది. పెండింగ్ వివాదాల పరిష్కారమే లక్ష్యం.. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాద సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. వీటికి బోర్డులు పరిష్కారం చూపలేకపోతున్నాయి. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల నియంత్రణ తమ పరిధిలో ఉండా లని బోర్డు పట్టుబడుతుండగా తెలంగాణ దాన్ని తిరస్కరిస్తోంది. కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని, నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నప్పుడు, బోర్డు నియంత్రణ అన్న ప్రశ్నే ఉదయించదని అంటోంది. జలాల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూడటం కోసం ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేర కు కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ రెండు బోర్డుల పనితీరును పర్యవేక్షిం చడానికి అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చైర్మన్‌గా వ్యవహరించే అపెక్స్ కౌన్సిల్లో ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సభ్యులు. కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసి ఐదేళ్లకు పైగా కావస్తున్నా ఇప్పటికీ వాటి పరిధి.. వర్కింగ్ మాన్యువల్‌ను కేంద్రం ఖరారు చేయలేదు. అపెక్స్ కౌన్సిల్ భేటీపై ఈ సమావేశంలో స్పష్టత తీసుకోనుంది. ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణ కు 15.9 టీఎంసీల కేటాయింపులు న్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదని పునరుద్ధరణ పనులకు ఏపీ సహకారం అందించాలని కోరుతోంది. 1978 గోదా వరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ అంటోంది. 80 టీఎంసీల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలోనే ఉందని, ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఆ నీటి వాటా హక్కు తెలంగాణదే అని చెబుతోంది. బచావత్ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా మరేదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని, ప్రస్తుతం ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కానందున దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని, బోర్డులను కోరింది. కేంద్రమే దీనికి పరిష్కారం చూపాల్సి ఉంది. -
కర్ణాటకకు మరో 14.75 టీఎంసీలు
న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశమిచ్చింది. అంతే పరిమాణంలో తమిళనాడుకు కోత విధించింది. కేటాయింపుల్లో తాగు నీటికే తొలి ప్రాధాన్యత అని సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తేల్చింది. బెంగళూరుకు ఉన్న ‘ప్రపంచ స్థాయి నగరం’ హోదాను దృష్టిలో పెట్టుకుని తాజా కేటాయింపులు చేస్తున్నామంది. 14.75 టీఎంసీల్లో బెంగళూరు నగర అవసరాలకోసం 4.75 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ తీర్పుతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని బిలిగుండ్లు నుంచి తమిళనాడుకు కర్ణాటక 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ‘బెంగళూరు విస్తీర్ణంలో మూడింట ఒక వంతు మాత్రమే కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటంతోపాటు అక్కడ 50 శాతం తాగునీటి అవసరాలు భూగర్భజలాల ద్వారానే తీరుతాయనే ఊహాజనిత కారణాలతో ట్రిబ్యునల్ కర్ణాటకకు కేటాయింపులను తగ్గించింది’ అని ధర్మాసనం తీర్పు చెప్పింది. జాతీయ ఆస్తి.. రాష్ట్రాల సొత్తు కాదు అంతర్జాతీయ నదీ జలాల సమాన పంపకాలకు సంబంధించిన హెల్సింకి, కాంపియన్, బెర్లిన్ నిబంధనలను తాజా తీర్పులో ఉటంకించిన కోర్టు.. నదులు జాతీయ ఆస్తులనీ, ఏ రాష్ట్రం కూడా ఒక నది పూర్తిగా తనకే చెందుతుందని చెప్పుకోజాలదని స్పష్టం చేసింది. ప్రకృతి వరప్రసాదాలైన నదీ జలాలను బాధ్యతాయుతంగా వాడుకునే హక్కు ఆ నది పారుతున్న ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 363 ప్రకారం ఈ కేసును సుప్రీంకోర్టు విచారించకూడదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కావేరీ జలాల వివాదం విషయమై 2016లో కర్ణాటక, తమిళనాడుల్లో ఘర్షణలు జరిగాయి. తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 సీడబ్ల్యూడీటీ 2007లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలకు వరుసగా 419, 270, 30, 7 టీఎంసీల నీటిని కేటాయించింది. తాజా తీర్పుతో తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 టీఎంసీల నీళ్లు దక్కనున్నాయి. కేరళ, పుదుచ్చేరిల కేటాయింపుల్లో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి మార్పులూ చేయలేదు. అలాగే నదీ పరీవాహక ప్రాంతం నుంచి 10 టీఎంసీల భూగర్భ జలాలను తోడుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. తీర్పును అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రానికి ధర్మాసనం ఆరు వారాల గడువిచ్చింది. 15 ఏళ్ల వరకు ఈ కేటాయింపులు అమలవుతాయని ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో ఆందోళనలు తీర్పు కర్ణాటకకు అనుకూలంగా ఉండటంతో తమిళనాడులో నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. అవాంఛిత ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలను మోహరించింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ సుప్రీంకోర్టు కేటాయించిన 177.25 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు అంకితభావంతో కృషిచేస్తామన్నారు. తమిళనాడు ప్రభుత్వం అసమర్థతతో కోర్టులో సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే తీర్పు కర్ణాటకకు అనుకూలంగా వచ్చిందని ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆరోపించింది. తీర్పు తనకు చాలా అసంతృప్తిని కలిగించిందని నటుడు రజనీకాంత్ అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలూ గొడవలకు దిగకుండా సామరస్యంగా మెలగాలని నటుడు కమల్ హాసన్ సూచించారు. తమ వాదనలకు అనుగుణంగా తీర్పు లేకపోయినప్పటికీ రాష్ట్రానికి కొంత ఊరట లభించిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. 1881 నుంచి వివాదం ► 1881వ సంవత్సరంలో కావేరీ నదిపై డ్యామ్ నిర్మించాలన్న అప్పటి మైసూర్ సంస్థానం ప్రయత్నాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్డుకోవటంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత నదీ జలాల పంపిణీపై రెండు ప్రభుత్వాలు 1892, 1924వ సంవత్సరాల్లో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవటంతో వివాదం పరిష్కారమయింది. ఈ ఒప్పందాల కాల పరిమితి 1974లో ముగిసింది. ► 1990 – తమిళనాడు కోరిక మేరకు కేంద్రం కావేరీ జల వివాద ట్రిబ్యునల్(సీడబ్ల్యూడీటీ)ను ఏర్పాటు చేసింది. ► 1991 – అత్యవసర సాయంగా కొంతనీరు విడుదల చేయాలన్న తమిళనాడు వినతిని సీడబ్ల్యూడీటీ తిరస్కరించింది. దీంతో తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం సూచనల మేరకు.. తమిళనాడుకు 205 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూడీటీ కోరగా కర్ణాటక పట్టించుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కర్ణాటక దిగిరాలేదు. ఈ పరిణామంతో కేంద్రం సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించింది. ► 1998 – సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను అమలు పరిచేందుకు ప్రత్యేకంగా కేంద్రం కావేరి నదీ ప్రాధికార సంస్థ(సీఆర్ఏ)ను ఏర్పాటు చేసింది. ► 2007 – ఏర్పాటైన 17 ఏళ్ల తర్వాత కావేరి జలాల పంపిణీ తుది అవార్డును సీడబ్ల్యూడీటీ ప్రకటించింది. నదీ జలాల పంపిణీపై 1892, 1924 సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందాల అమలే సరైన పరిష్కారమని అందులో పేర్కొంది. ► 2013 – కావేరి యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని తమిళనాడు కోరడంతో ఆ మేరకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ► 2013 మే 28 – సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయనందుకు తనకు కలిగిన రూ.2,480 కోట్ల నష్టాన్ని కర్ణాటక చెల్లించాలంటూ తమిళనాడు సుప్రీంకు వెళ్లింది. ► 2013 – నీటి విడుదలపై సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయాలన్న తమిళనాడు డిమాండ్ సహేతుకం కాదని కావేరీ పర్యవేక్షక కమిటీ పేర్కొంది. ► 2016 సెప్టెంబర్ 11 – కావేరి నీటి విడుదలపై ఉత్తర్వులను సవరించాలని కర్ణాటక వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ చెన్నైలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు. చెన్నైలో కర్ణాటక బస్సుకు రక్షణగా వెళ్తున్న పోలీసులు