వృద్ధికి ఫేస్‌బుక్ తోడ్పాటు
న్యూయార్క్: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ అంతర్జాతీయంగా గతేడాది ఆర్థిక వృద్ధి పరంగా 227 బిలియన్ డాలర్ల మేర, ఉపాధిపరంగా 45 లక్షల ఉద్యోగాల మేర సానుకూల ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఫేస్‌బుక్ మార్కెటింగ్, ప్లాట్‌ఫాం ఏ మేరకు తోడ్పడ్డాయన్న అంశంపై కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ చేసిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
వ్యాపార సంస్థలు పెద్దవైనా, చిన్నవైనా తమ వ్యాపారాల విస్తరణకు నిత్యం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నాయని ఫేస్‌బుక్ పేర్కొంది. మార్కెటింగ్‌పరంగా అడ్డంకులను కూడా తగ్గించేలా వివిధ వ్యక్తులు, వ్యాపార సంస్థలను అనుసంధానం చేస్తూ కొంగొత్త వ్యాపార అవకాశాలను ఫేస్‌బుక్ అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ తెలిపారు. తద్వారా ప్రపంచ ఆర్థిక వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నామని ఆమె వివరించారు.