18% పెరిగిన దేశీ విమాన ప్రయాణికుల రద్దీ
న్యూఢిల్లీ : భారత్‌లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ మే నెలలో 18.2 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) గణాంకాల ప్రకారం.. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో విమాన ప్రయాణికుల రద్దీ 7.7 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు దేశీ విమాన సంస్థలు మంచి ప్రదర్శన కనబరచడం, ఆర్థిక వృద్ధి పరిస్థితులు మెరుగుపడటం వంటి అంశాలే కారణం. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం చూస్తే దే శీ విమాన ప్రయాణికుల రద్దీ మే నెలలో 18.35 శాతం వృద్ధితో 71.27 లక్షలుగా ఉంది.