గాంధీనగర్: దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోందనీ, అయితే అది గత రెండేళ్లలో సాధించింది మాత్రమే కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. గత 15 ఏళ్లుగా భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం కన్నా ఎక్కువే ఉందనీ, రెండేళ్లు 8.5% వృద్ధిని కూడా సాధించామని గుర్తు చేశారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఉన్న ‘బాపూ గుజరాత్ విజ్ఞాన గ్రామం’ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని భిన్నత్వాన్ని ఆస్వాదించాలనీ, దాన్ని కృత్రిమంగా ఏకరూపంలోకి తీసుకురావొద్దని సూచించారు.