రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించి, తద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు ‘వాల్టా’ చట్టాన్ని సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన అటవీశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించి, తద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు ‘వాల్టా’ చట్టాన్ని సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 344 సూత్రాల సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక కింద చెట్ల నరికివేతకు సరళీకృత అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అటవీశాఖ పరిధిలోని భూముల్ని కేటాయించేప్పుడు వందలాది నిబంధనలు ఉండటంతో పారిశ్రామిక వేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రూపొందించిన 344 సూత్రాల సంస్కరణల కార్యాచరణ ప్రణాళికకు సర్కార్ ఆమోదం తెలిపింది..