ఫ్రాంక్‌ఫర్ట్: యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం, వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. తీవ్ర ద్రవ్యోల్బణంతో వినియోగదారులు వ్యయాలకు సుముఖత చూపడం లేదని, అధిక వడ్డీ రేట్లు పెట్టుబడికి అవసరమైన రుణాన్ని పరిమితం చేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం, ఈయూ ప్రాంతంలో మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వడ్డీరేట్లు మరింత పెంచాలా? వద్దా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
తాజా ప్రకటన ప్రకారం, 2023లో యూరో కరెన్సీ వినియోగిస్తున్న 20 దేశాల వృద్ధి రేటు క్రితం అంచనా 1.1 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గించడం జరిగింది. వచ్చే ఏడాది విషయంలో ఈ రేటు అంచనా 1.6 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 27 దేశాల ఈయూ విషయంలో ఈ రేటును 2023కు సంబంధించి 1 శాతం నుంచి 0.8 శాతానికి, 2024లో 1.7 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గించడం జరిగింది. రష్యా–యుక్రేయిన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా నుంచి క్రూడ్ దిగుమతులపై ఆంక్షలు యూరోపియన్ యూనియన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment