
న్యూఢిల్లీ: వచ్చే రెండు దశాబ్దాల పాటు భారత్ అధిక వృద్ధి బాటలోనే కొనసాగగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. అతి పెద్ద సవాలైన పేదరికాన్ని రూపుమాపేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.
బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్ వినోద్ రాయ్ సహరచయితగా వ్యవహరించిన ’ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతం– పరిశీలన’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా జైట్లీ ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో భారత్ అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ.. తట్టుకుని నిలబడిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధి అధికంగా ఉండనున్నప్పటికీ సరిహద్దు భద్రత, చొరబాట్లు .. రెండూ సవాళ్లుగానే ఉండొచ్చని వివరించారు.