న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వపరంగా ఎలాంటి కమిటీనీ వేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. వాటిపై నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తోందని గుర్తు చేసింది. ఈ విషయమై లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
‘‘ఇండొనేసియా నుంచి బొగ్గు దిగుమతుల విషయమై కూడా అదానీ కంపెనీపై విడిగా జరుగుతున్న దర్యాప్తు ఇంకా తుది దశకు చేరలేదు. విద్యుదుత్పత్తి, సంపిణీ పరికరాల దిగుమతికి సంబంధించి అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల మీద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ దర్యాప్తు పూర్తయింది. నివేదిక కూడా అందింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగు చూసిన తర్వాత గత జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య అదానీ గ్రూప్‌కు చెందిన 9 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 60 శాతం క్షీణత నమోదైంది’’ అని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment