మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సీ వేసి వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించి మాట తప్పిన కేసీఆర్ తలనరుక్కోవాలని డిఎస్సీ సాధనకమిటి అధ్యక్ష, కార్యదర్శులు శివుడు, మల్లేష్‌లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన 15 నెలల నుంచి ప్రతి నెలా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవి విరమణ పొందుతున్న తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు లేవనడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖలో 24,861 పోస్టులు ఉన్నాయని లెక్కలు తేల్చిన ప్రభుత్వం హేతు బద్దీకరణతో 15వేల పోస్టులను మాయం చేసిందని విమర్శించారు. ఇప్పట్లో డిఎస్సీ లేదని విద్యాశాఖమంత్రి ప్రకటించడం నిరుద్యోగులను నిరాశకు గురి చేయడమేనని అన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేనప్పుడు 9,800 ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఎందుకని ప్రశ్నించారు.
'మాట తప్పిన కేసీఆర్ తల తీసేసుకోవాలి'
Published Mon, Aug 17 2015 11:22 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement