shivudu
-
శివ.. శివా.. ఆ ఎమ్మెల్యే నల్లతాచు
‘నల్లబాలు.. నల్లతాచు లెక్క’ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాకు చెందిన ‘దేశం’ ఎమ్మెల్యే నిజంగా ‘నల్ల’తాచు లెక్క.. ఆయన దురాగతాలకు అంతేలేదు. నాసిరకం బయో మందులు విక్రయిస్తూ రైతులను వంచిస్తారు. ఎన్ఆర్ఐలు, గ్రానైట్ పరిశ్రమల నుంచి వసూలు చేసిన ‘నల్లధనం’తో ఎన్నికల బరిలోకి దిగుతారు. ఓట్లు కొంటారు, దొంగ ఓట్లు వేయిస్తారు. ఎలాగైనా గెలిచి మళ్లీ ప్రజలను పీడించుకుతినడమే ఆయన నైజం. పేరుకే ఆయన ‘శివుడు’.కానీ పనులన్నీ భస్మాసురుడిని తలపిస్తాయి. ఆ ఎమ్మెల్యే నల్లతాచు సాక్షి టాస్క్ఫోర్స్: బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే అక్రమంగా వసూలు చేసిన నల్లధనంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడటంతో అక్రమాల తుట్టె కదులుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో నీరు – చెట్టు పనుల్లో రూ. కోట్లు కొల్లగొట్టి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు – చెట్టు ద్వారా చెరువులు తవ్వాలని అప్పట్లో ఆయన పట్టుబట్టడంతో దళితులు వ్యతిరేకించారు. దళితులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడడంతో చివరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నాసిరకం బయో మందులపై సర్కారు చర్యలు తీసుకుంది. అయినా నకిలీ మందులు విక్రయించడం మాత్రం ఆపలేదు. అగ్రిటెక్ మాటున నకిలీ మందులు గుంటూరులోని ఎమ్మెల్యేకి చెందిన తన అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్డీఆర్ఐ) జరిపిన తనిఖీల్లో ఆయన ఎన్నికల అక్రమాలు వెలుగుచూశాయి. ఎన్ఆర్ఐల నుంచి నిధులు పోగేసి తొలుత ఆ నిధులను తన కంపెనీకి తరలించి అక్కడి నుంచి ఎన్నికలకు వెచ్చించినట్లు వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో దొరికిన డైరీలో ‘నల్లధనం’ లెక్కలు వెలుగుచూశాయి. ఆ నిధులతోనే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు,దొంగ ఓట్లు చేర్చడం, ఎన్నికల్లో ఇతరత్రా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత ఆయన టీడీపీ మాజీ ఎంపీ దగ్గర పనిచేశారు. ప్రస్తుతం ఆ మాజీ ఎంపీ తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనకు ఏపీలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్నప్పుడే అగ్రిటెక్ కంపెనీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే ఆ కంపెనీ తయారు చేసిన నకిలీ బయో ఎరువులు, పురుగు మందులను రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించారు. మాజీ ఎంపీకి బినామీగా ఉన్న సమయంలో ఆయన అండతోనే ఎదిగారన్న ప్రచారమూ ఉంది. మైనింగ్,విజిలెన్స్ అధికారులపైనా దాడులు ఆ నియోజకవర్గంలో తన సామాజికవర్గం బలంగా ఉంది. ఆ వర్గంలో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా గత రెండు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు సమకూర్చారు. అదంతా నల్లధనమేనన్న ఆరోపణలు ఉన్నాయి. మార్టూరు మండలంలో 250కిపైగా గ్రానైట్ పరిశ్రమలు సామాజికవర్గం చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్ రాయల్టీ లేకుండానే తరలిపోతోంది. దీనికి సహకరిస్తున్న నేతలకు పరిశ్రమల యజమానులు నిధులు కుమ్మరిస్తారు. వీరి నుంచి అధికమొత్తంలో నిధులు వెళ్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో 15 వేలకు పైగా దొంగ ఓట్లు చేరి్పంచడంతో ఇటీవల అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. దీనిలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. తన అగ్రిటెక్ కార్యాలయంలో లభించిన డైరీలో ఎమ్మెల్యే అక్రమాలు బయటపడటంతో ఎమ్మెల్యేతోపాటు కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యేను ఏ–1గా చూపారు. మార్టూరు గ్రానైట్ పరిశ్రమల నుంచి అక్రమంగా సరుకు తరలిపోతుందన్న ఫిర్యాదుతో జనవరి 30న తనిఖీలకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులను తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అడ్డుకొని దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పరారైన ఎమ్మెల్యేకు తర్వాత 41 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టారు. కేసులు ‘అనంత’ం ► మార్టూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీల నిమిత్తం వచ్చిన విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులను అడ్డగించిన సందర్భాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై 31/2024, 31/01/2024న ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ► 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం వంటివి ఆధారాలతో బట్టబయలు కావడంతో ఎమ్మెల్యేపై ఏ1గా కేసు నమోదు చేశారు. ► బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఇ), రెడ్ విత్ 120(బి), సీఆరీ్పసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేసారు. ► 220/2023, 19/09/2023వ తేదీన ఎమ్మెల్యేపై మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
ఆదిభిక్షువు అన్నపూర్ణ
పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులే కాదు, ఆది ప్రేమికులు కూడా. ఇద్దరి సంపదలు సమానం కావు. ఇద్దరి రూపురేఖలు ఒకటి కావు. ఆగర్భ శ్రీమంతురాలు పార్వతి. శ్మశానంలో తిరుగుతూ కపాలంలో భిక్షాటన చేసే కడు నిరుపేద శివుడు. ఆ మాత్రానికే శివుడి కోసం పార్వతి తపస్సు చేసింది. తన జుట్టంతా ఎర్రగా చిక్కులు పడిపోయినా, తన చెక్కిళ్లు వాడిపోయినా తపస్సు వీడక, మునుల ప్రశంసలు పొందింది. పైపెచ్చు తల్లిదండ్రుల అనుమతితోనే శివుడికోసం ఆ తపస్సును ఆచరించింది! ఎందుకు అంత కష్టపడింది పార్వతి? హిమవంతుడు చిటికె వేస్తే సంపన్నులు, సుందరాకారులు వరుసలో నిలబడతారు. అయితే సంపదలకు, బాహ్య సౌందర్యానికి ఆశపడలేదు పార్వతి. తనతో సమానమైన పరిజ్ఞానం కలిగినవాడే తనకు భర్త కావాలనుకుంది. ఆకులను కూడా రుచి చూడకుండా తపస్సు చేస్తూ ‘అపర్ణ’ అయ్యింది. అందుకే శివపార్వతుల కల్యాణం లోకకల్యాణమైంది. శివపార్వతులు ఆదర్శ దంపతులయ్యారు. ఆ ఆదిభిక్షువు, ఈ అన్నపూర్ణ తమ పెళ్లినాటి సందర్భాలను సంభాషించుకుంటే ఎలా ఉంటుందనే ఊహకొక సృజనకథనమిది. ►పార్వతి: స్వామీ! మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా! ►శివుడు: అంత కష్టపడటం ఎందుకు? మీ తల్లిదండ్రులు నా కంటే యోగ్యులను తీసుకువచ్చి నీ వివాహం ఘనంగా జరిపించేవారు కదా! ►పార్వతి: స్వామీ! మీరే కావాలని నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలియదా! ►శివుడు: తెలియకేం.. నీ మనసు తెలుసుకోవాలనే కదా, నేను బ్రహ్మచారి వేషంలో నీ దగ్గరకు వచ్చాను. ►పార్వతి: స్వామీ! నన్ను పరీక్షించడం కోసం మిమ్మల్ని మీరు ఎన్నిరకాలుగా నిందించుకున్నారో కదా! మీకు శివుడు తెలుసన్నారు. నేను ఎంత తపస్సు చేసినా ఆయన నాకు ప్రత్యక్షమవ్వకుండా, నన్ను అవమానం చేశాడన్నారు. శ్మశానంలో నివసించేవానితో వివాహం ఏమిటని కూడా వారించారు. ►శివుడు: అవును పార్వతీ! నాకు అన్నీ గుర్తున్నాయి. వివాహం చేసుకునే ముందు ఇద్దరి మనసులు కలవాలి, ఇద్దరి భావాలు కలవాలి. నీ ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. ►పార్వతి: చేతి కంకణం గురించి మీరు అన్న మాటలు నేటికీ నేను మరచిపోలేకపోతున్నాను. మంగళకరమైన వివాహ కంకణం ఉన్న నా చేతిని.. పాము కడియంగా ఉన్న చేతితో పట్టుకోవాలని, అది ఓర్చుకోవడం కష్టమని, ఆలోచించుకోమని నన్ను మీరు భయపెట్టారు. ►శివుడు: మరో మాట కూడా అన్నాను గుర్తుందా. శివుడిని వివాహమాడితే రక్తం కారే తోలుకి, హంసలు చిహ్నంగా ఉన్న పట్టు చీరకు కొంగుముడి వేయాలని. అలాగే ‘మంచి భవనంలో పువ్వుల మీద లత్తుక చిహ్నాలుగా ఉంచడానికి అర్హములైన నీ పాదాలు, వెంట్రుకలు వ్యాపించి ఉన్న కాటిలో ఉంచడానికి పగవాడు సైతం అంగీకరించడు కదా’ అని నీకు జుగుప్స కలిగేలా మాట్లాడాను. ►పార్వతి: గుర్తుంది. నేనేమన్నానో కూడా గుర్తుంది కదా. కీడును పోగొట్టి, సంపదలు కలగడానికి మంగళకరమైన చందనాలు ధరిస్తారు. అవి మళ్లీ కోరికలను పుట్టిస్తాయి. కోరికలే లేనివాడైన శివుడికి వీటితో పని ఏంటి? అన్నాను. అంతేనా ఆయన ధరించిన కాటి బూడిద పవిత్రమైనది కాబట్టే, ఆ బూడిదను దేవతలు శిరస్సు మీద ధరిస్తున్నారని కూడా చెప్పాను కదా. ►శివుడు: నా వాహనం గురించి నేను చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయి కదా పార్వతీ! ఏనుగుపై ఊరేగవలసిన నువ్వు ముసలి ఎద్దు వాహనం మీద ఊరేగుతూంటే, మహాజనులంతా నవ్వుతారని చెప్పాను కదా. ►పార్వతి: అందుకు నేను చెప్పిన సమాధానం మరోసారి గుర్తు చేస్తాను స్వామీ. ఐరావతం ఎక్కి తిరిగే ఇంద్రుడు.. పేదవాడై ఎద్దుని ఎక్కి తిరిగే శివుyì కి నమస్కరిస్తున్నాడు అన్నాను. అయినా మీరు అక్కడితో ఆగారా! ఇంకా ఎన్నెన్ని వ్యంగ్యాలు మాట్లాడారు. కండ్లు చక్కనివాడు కాదని, దిసమొల వాడని, శాస్త్రం తెలిసినవాడు కాదని, ఒకటి కాకపోతే ఒక్కటైనా నాకు సరితూగే లక్షణాలు శివుడిలో లేవని చెప్పారు. శివుడిని వివాహం చేసుకునే ప్రయత్నం మానుకోమని కూడా సెలవిచ్చారు. ►శివుడు: అయ్యో! నేనెలా మరచిపోతాను పార్వతీ! బ్రహ్మచారి వేషంలో నేను అలా శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, నీ కనుబొమలు వంకరయ్యాయి, కండ్ల కొనలు ఎర్రబారాయి, కళ్లు అడ్డంగా తిప్పావు. (ఇష్టం లేని మాట వింటే ఉండే లక్షణాలు). నీ çసమాధానాలకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది పార్వతీ! నీ పరిజ్ఞానంతో ఎంత చక్కటి సమాధానాలు పలికావు. అంతేనా, నా పుట్టుక గురించి వారు నిందిస్తే, దానికి కూడా ఎంత బాగా సమాధానం చెప్పావు నువ్వు. ►పార్వతి: నాకు పొగడ్తలు అక్కరలేదు కానీ, వారు నిందించినా సత్యమే పలికారు. స్వయంభువు అయిన మీ జన్మ మీకు ఎలా తెలుస్తుంది? స్వేచ్ఛగా తిరిగేవారైన మీరు లోకులు ఏమనుకుంటారో అని భయపడరు. ఒకరికి భయపడవలసిన అవసరం మీకు లేదు. ►శివుడు: నువ్వంటే ఒక్క విషయంలో నాకు చాలా గర్వం పార్వతి. నువ్వు ఎన్నో క్లేశాలు అనుభవించి తపస్సు చేశావు. నిన్ను మునులు కీర్తిస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా. ►పార్వతి: అయ్యో! స్వామీ! మునుల ఆశీర్వాద బలంతోనే కదా నేను తపస్సు ఆచరించగలిగాను. ►శివుడు: పార్వతీ! చివరగా ఒక్కమాట అంటున్నాను, ‘ఈ రోజు మొదలు నీ తపస్సులచే దాసుడనైతిని’ అంటూ పార్వతిని తన శరీరంలో సగ భాగం చేసి అర్ధనారీశ్వరుడయ్యాడు. అలా వారు ఆదిదంపతులయ్యారు. అలా వారి ప్రేమ ఆదర్శదాయకం అయింది. అలాగే ప్రేమికులకు వారి ప్రేమ మార్గదర్శకం కావాలి. వైజయంతి పురాణపండ -
లేపాక్షి బసవన్న
స్కాందపురాణం ప్రకారం మనదేశంలోని 108 శైవక్షేత్రాలలో అనంతపురం జిల్లా లేపాక్షిలో కొలువై ఉన్న శివుడికి పాపనాశేశ్వరుడని పేరు. ఈ క్షేత్రం శిల్పక కు పెట్టింది పేరు. ఆలయ స్తంభాలమీద విజయనగర రాజుల కాలంనాటిఅద్భుత శిల్ప కళానైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. లేపాక్షిలో యాత్రికులను కట్టిపడేసే మరొక అద్భుతం లేపాక్షి బసవన్న. దాదాపు 16 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో మెడలో చిరుమువ్వలు, కాళ్లకు గజ్జెల పట్టెడలతో, మూపున అలంకరించిన దుస్తులతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన నందీశ్వరుడి సజీవ శిల్పం చూస్తుంటే లేచివస్తాడేమో అనిపిస్తుంది. మెడచుట్టూ మూడురకాల పట్టెడలు, అన్నింటికంటె కింఇభాగాన 29 గంటలున్న పట్టెడ, దానిపైన 18 మువ్వలున్న పట్టెడ, ఆ పైన 27 రుద్రాక్షలున్న మాలతో అలంకరించి ఉన్న ఈ శిల్పం కాళ్లు, తోక పొట్టకిందుగా లోపలికి మడిచిపెట్టుకుని ప్రశాంత గంభీరంగా కనిపిస్తుంది. లేపాక్షి చుట్టుపక్కల ఎవరి పశువుకైనా జబ్బు చేస్తే వారు ఈ నంది విగ్రహం వద్దకు వచ్చి నూనెతో దీపాన్ని వెలిగించి మొక్కుకుని వెళతారు. వాళ్లు మొక్కుకున్న మరుసటిరోజే ఆ జబ్బు నయమవుతుందట. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లేపాక్షి నంది రంకె వేస్తే ప్రళయం వస్తుందని స్థలపురాణం చెబుతోంది. – శ్రీలేఖ -
కోర్కెలు తీర్చే గోలెం
దక్షిణ కాశిగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశిలో లింగం, గంగలో స్నానం.. శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తండోపతండాలుగా వస్తారు. ఈ క్షేత్రంలో ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలు నాలుగు రోజులపాటు మార్చి 4 నుంచి 7 వరకూ జరుగుతాయి. గోలేం కథ ఇది స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టుకి వెనుక పెద్ద మట్టి గోలెం ఉంది. అది ఎంత పెద్ద గోలెమంటే గర్భాలయం ద్వారం పట్టనంత. శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్న సంతానం కోసం స్వామివారిని పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా ఆవు పాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు. మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా పాలుపోసి దానిని గర్భాలయంలోనికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భగుడి ముఖ ద్వారం పట్టనంత పెద్ద గోలెం అవడంతో గర్భాలయంలోనికి తీసుకెళ్లలేక అమితమైన దుఃఖంతో గోలెంతోపాటు తనకు ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా ఆలయం ముఖమంటపంలోనే విడిచి పెట్టి ఇంటికి వెళ్లిపోతాడు. మర్నాడు స్వామి వారి నిత్యపూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలెం మూలవిరాట్టు వెనకాల ఉన్నది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలెం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటున్నాడు. ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహాత్యాన్ని వేనోళ్ల సుత్తించారు. న్యాయమైన కోర్కెలు తీర్చే నాగభూషణుడు ఈ గోలెంలో పాలతోపాటు బియ్యం, వడ్లు (ధాన్యం) మంచినీరు, అన్నం, పండ్లు ఇలా భక్తులు మొక్కులకు అనుగుణంగా ఆ గోలెం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. దీనిఫలితంగా సంతాన యోగం, గ్రహాదోషాల నివారణ, వివాహాలు, ఇతర న్యాయపరమైన కోర్కెలు తీరుతాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. ఇలా తమ కోర్కెలను తలచుకొని ఆ గోలేన్ని ముట్టుకొని ఆ పరమేశ్వరుని నిండు మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు కొద్దికాలంలో తీరుతాయన్నది భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీముఖలింగం గోలెం వర్ధిల్లుతోంది. సుంకరి శాంత భాస్కరరావు సాక్షి, జలుమూరు. శ్రీకాకుళం -
భీమేశ్వరునికి.. నందీశ్వరునికీ నడుమ...∙
ద్రాక్షారామం (రామచంద్రపురం రూరల్): సాధారణంగా భక్తులు ఏ శివాలయానికి వెళ్లినా చండీశ్వరుడిని, నందీశ్వరుడిని దర్శించి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి మూల విరాట్ దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది. అయితే దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామలో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి దేవాలయంలో ఆలయ అధికారులు భీమేశ్వరునికి, నందీశ్వరుడికీ మధ్య దాతలు ఇచ్చిన దర్బారు మండపాన్ని ఏర్పాటు చేయడంపై శివ భక్తులు, గ్రామస్తులు, అర్చకులు, పురోహిత పెద్దలు కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దర్బారు మండపానికి అద్దాలు అమర్చి అందులో స్వామివారి మూర్తులను ఉంచి తీర్థం, పాదుకలు ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన సమంజసం కాదంటున్నారు. దీనివల్ల స్వామికి, నందీశ్వరుడికి మధ్య ఆటంకం ఏర్పాటు చేసినట్టవుతుందని, అంతేకాకుండా భక్తుల రద్దీ వేళల్లో భక్తులకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు. అక్కడికి బదులుగా భక్తులకు అనుకూలంగా ఉండే మరో చోటుకు ఈ మండపాన్ని మార్చాలని కోరుతున్నారు. అందరినీ ఆలోచించి చేస్తాం కొంతమంది పెద్దల సూచన మేరకు మండపాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. అక్కడ పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటే, అందరితో ఆలోచించి మండపం స్థలం మార్చేందుకు నిర్ణయం తీసుకుంటాం. – పెండ్యాల వెంకట చలపతిరావు, ఈఓ, శ్రీ భీమేశ్వరస్వామివారి దేవస్థానం, ద్రాక్షారామ -
భూ కైలాస్
నాటి సినిమా శివసుతుని దివ్య చమత్కారం. శివుడు భక్త సులభుడు. రావణుడు భక్త ధురంధరుడు. శివుడికి భక్తుడు కావాలి. రావణుడికి శివుడు కావాలి. ఈ రెండూ విచక్షణ కోల్పోతే మానవులకూ దేవతలకూ ఉపద్రవం వచ్చి పడుతుంది. దానిని నిలువరించే శక్తి కావాలి. ఆ శక్తే విఘ్నేశ్వరుడు. చివరి నిమిషంలో ఆయన చూపిన చమత్కారమే ‘భూ కైలాస్’ కథ. రావణుడు విశిష్ట శివభక్తుడు. రావణుడి తల్లి కైకసి నిత్య హరనామస్మరణలో తరియించే భక్తాగ్రేసరురాలు. ఆమె ప్రతినిత్యం సముద్రపు ఒడ్డున సైకత లింగం ప్రతిష్ఠించి దానికి పూజలు చేసి ఆ ప్రసాదాన్ని తన పుత్రుడు రావణుడికి ఇస్తుంటుంది. ఆ ప్రసాద బలమే రావణుడి మహాబలం. ముల్లోకాలను గడగడలాడించగల ప్రచండబలం. అప్పటికే రావణుడు భూలోకాన్ని జయించాడు. అంతటితో తృప్తి తీరక అమరపురిపై దండెత్త దలిచాడు. అదే గనక జరిగితే దేవేంద్రుని పీఠం కదిలిపోతుంది. నారాయణుని ఉనికికి సవాలు ఎదురవుతుంది. నారదుడు ఇది గ్రహించి దేవేంద్రుణ్ణి రావణుడిపై ఉసిగొలుపుతాడు. కైకసి ఆరాధించే సైకత లింగపూజను భగ్నం చేసి ఆ ప్రసాద బలం రావణుడికి అందకుండా చేయమంటాడు. దేవేంద్రుడు అలలలో దూరి సైకత లింగాన్ని కబళిస్తాడు. పూజను నీటిపాలు చేస్తాడు. కైకసి దీనిని దుశ్శకునంగా భావిస్తుంది. శివుడికి అపచారం జరిగిందని తల్లడిల్లుతుంది. తల్లి వేదనను గ్రహించిన రావణుడు నిత్యం తయారు చేసుకునే సైకత లింగమేలా... ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని ఏకంగా అతని ఆత్మలింగమే తీసుకొని వస్తానని శపథం చేస్తాడు. ఏదో చేయబోతే ఏదో అయినట్టు అదే గనక జరిగితే భూలోకమే కైలాసం అవుతుంది. దేవగణాలన్నీ ఆత్మలింగం ఉన్న చోటుకే తరలివచ్చి దేవపురి దివాలా తీస్తుంది. అందుకే దేవేంద్రుడు రావణుని ఘోర తపస్సును భగ్నం చేయబూనుకుంటాడు. త్రాచులను వదులుతాడు. కొండ చిలువలను చుట్టబెడతాడు. అప్పటికీ చలించకపోతే ఆఖరు అస్త్రంగా దేవ వేశ్యలను దించుతాడు. అయినప్పటికీ రావణుడు బెసకడు. లొంగడు. సంకల్పం నుంచి చెదరడు. ఆ తపస్సుకు మెచ్చి శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. మరు నిమిషంలో ఆ ఆదిదేవుడు భక్తుని కోరిక మేరకు ఆత్మలింగం సమర్పించేవాడే. కాని అంతలోనే విష్ణువు విష్ణుమాయను చూపుతాడు. రావణుడిలో మాయను ప్రవేశపెట్టి ఆత్మలింగానికి బదులు ఏకంగా పార్వతినే తన పత్నిగా చేయమని అడిగేలా చేస్తాడు.జగన్మాతను ఆశించిన ఆ కోరిక నాశన హేతువు. అయినప్పటికీ వచనబద్ధుడైన శివుడు ఇచ్చిన మాట కాదనలేక పార్వతిని రావణుడికి అప్పజెప్పుతాడు. శివ వియోగంతో తల్లడిల్లిన పార్వతి దీనికంతటికీ కారణం విష్ణుమాయ అని గ్రహించి ‘ఓ నారాయణుడా... నా వియోగబాధ నీకు అర్థమవ్వాలంటే భూలోకాన మానవ జన్మ ఎత్తి సతీ వియోగంతో ఇంతకింత బాధ అనుభవించు’ అని శపిస్తుంది. అది విని నారదుడు ఆనందబాష్పాలు రాలుస్తాడు.ఎందుకంటే రావణుడి అంతం రాముడి చేతిలో ఉంది. రాముడి జన్మకు ఈ శాపమే కారణమవుతోంది.ఈ శాపం ఇచ్చాక పార్వతి రావణుణ్ణి మాయ చేసి తిరిగి శివుని సన్నిధికి చేరుకుంటుంది. మరోవైపు రావణుడు పాతాళ లోకాధిపతి అయిన మయాసుర కుమార్తె మండోదరిని చూసి ఆమే మాయారూపంలో ఉన్న పార్వతి అనుకుని ఆమెను కాంక్షిస్తాడు. వివాహం చేసుకుని లంకకు తీసుకుని వస్తాడు.సాక్షాత్తూ పార్వతీదేవిని వివాహం చేసుకుని వచ్చిన రావణుణ్ణి చూసి రావణుని తల్లి కైకసి హతాశురావుతుంది. శివద్రోహి, మాతృద్రోహి అంటూ రావణుణ్ణి దూషిస్తుంది. అప్పటికిగాని రావణుడిలోని విష్ణుమాయ వదిలిపోదు. ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని వాంఛించడం, మండోదరిని పార్వతి దేవే అనుకొని వివాహం చేసుకోవడం ఇవన్నీ గుర్తుకు వచ్చిన రావణుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. మండోదరిని భార్యగా స్వీకరించి ఈసారి నిజంగా ఆత్మలింగం సాధించుకొని రావడానికి బయలుదేరుతాడు. ఘోర తపస్సు జరుగుతుంది. రావణుడు తన తలను ఖండించుకుని శివుడికి అర్పణం చేస్తాడు.శివుడు మరి నిలువలేక ప్రత్యక్షమై వక్షస్థలం నుంచి దివ్య తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్న ఆత్మలింగాన్ని పెకలించి రావణుని చేతిలో పెడతాడు. ‘లంకకు చేరుకునే వరకు ఈ లింగాన్ని నేలకు దించకు. ఎక్కడ దించితే అక్కడే అది స్థిరపడిపోతుంది. దానిని కదల్చడం స్వయంగా నా వల్ల కూడా కాదు’ అని చెప్తాడు. రావణుడు ఆత్మలింగం తీసుకుని బయలుదేరుతాడు.అదే జరిగి ఆత్మలింగం లంకకు చేరితే రావణుడు మరింత శక్తిమంతుడవుతాడు. మరింత పెట్రేగుతాడు. అందుకనే నారదుడు విఘ్నేశ్వరుణ్ణి శరణుజొచ్చుతాడు.‘విఘ్నేశ్వరా. నీకు ప్రథమ పూజ చేయకుండా అవిఘ్నంగా రావణుడు ఆత్మలింగాన్ని పట్టుకు పోతున్నాడు’ అని నివేదిస్తాడు. విఘ్నేశ్వరునికి కోపం వస్తుంది. ‘రావణుడు అంత పని చేస్తాడా’ అని బ్రాహ్మణ బాలుని రూపంలో రావణుడి దారిలో కాపు కాస్తాడు. ఇదే అదనుగా విష్ణుమూర్తి తన చక్రాన్ని సూర్యుడికి అడ్డం పెట్టి సంధ్యా సమయాన్ని సృష్టిస్తాడు. అది గమనించిన రావణుడు సంధ్య వార్చడానికి వెళ్లి వస్తానని దారిలో కనిపించిన విఘ్నేశ్వరుని చేతిలో ఆత్మలింగాన్ని పెడతాడు. తాను వచ్చే వరకు దానిని నేలకు దించవద్దని సూచిస్తాడు.కాని మాయా రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు ‘నేను ముమ్మార్లు నిన్ను పేరు పెట్టి పిలుస్తాను. వచ్చావా సరేసరి. లేదంటే లింగాన్ని కింద పెట్టేస్తాను’ అంటాడు. రావణుడు సంధ్య వారుస్తుండగా గబగబా ముమ్మార్లు రావణుని పేరు పిలిచి లింగాన్ని నేలకు దించేస్తాడు. ఇంకేముంది. ఆత్మలింగం తక్షణమే అదే స్థలిలో ప్రతిష్టితమైపోతుంది. రావణుడు ఎంతో విలపిస్తాడు. విఘ్నేశ్వరుణ్ణి దుర్బాషలాడతాడు. తల మీద మొట్టుతాడు. లింగాన్ని ఊడ పెరకడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. తుదకు ఆత్మలింగాన్ని అక్కడే వదిలిపెట్టి లంకకు పయనమవుతాడు. అలా అసురుని బారిన పడాల్సిన ఆత్మలింగం విఘ్నేశ్వరుని పుణ్యమా అని భూలోకాన ప్రతిష్టితమై మానవుల పూజలను అందుకునే దివ్యలింగంగా నేటికీ అలరారుతోంది.అలా ఆత్మలింగం ప్రతిష్టితమైన పుణ్యక్షేత్రమే కర్నాటకలో ఉన్న గోకర్ణం. అక్కడ పూజలందుకుంటున్న మహాబలేశ్వర లింగమే నాటి ఆత్మలింగం. ‘గోకర్ణం’ క్షేత్ర కథ ఆధారంగా ఏ.వి.ఎం ప్రొడక్షన్స్వారు 1958లో తీసిన చిత్రమే ‘భూకైలాస్’. ఎన్టీఆర్ రావణాసురుడిగా, జమున మండోదరిగా, అక్కినేని నారదుడిగా నటించిన ఈ సినిమా ఆబాలగోపాలాన్ని అలరించి హిట్గా నిలిచింది. తమిళనాడులో రావణుడికి ఉన్న ఆదరణ దృష్ట్యా ఇదే సినిమా అక్కడ ‘భక్త రావణ’గా అనువాదమై విడుదలైంది. నిజానికి ఈ సినిమా రావణుని అమాయక, అచంచల భక్తికి ఒక మచ్చుతునక. శివుని మీద అతడికున్న భక్తి, అతడి వీరత్వం, నిజాయితీ దేవతల పథక రచన, పన్నాగం ఈ సినిమాలో కనిపిస్తాయి. అందరూ కలిసి రావణుని దారి మళ్లించి అతడికి దక్కవలసిన ఆత్మలింగాన్ని దక్కకుండా చేస్తారు.అయినప్పటికీ రావణుడు అఖండ శివభక్తునిగా పురాణాల్లో నమోదయ్యాడు. అతని వంటి శివభక్తుడు మరొకడు లేదు. ఎన్టీఆర్ రావణుని పాత్రను పాలధార వంటి స్వచ్ఛతతో పోషించి ఆకట్టుకుంటే అక్కినేని నారద పాత్రకు ఉండాల్సిన వంచనా శిల్పాన్ని ప్రదర్శించి మెప్పిస్తారు. సముద్రాల మాటలూ పాటలూ అందించిన ఈ సినిమాకు ఆర్. సుదర్శనం సంగీతం అందించారు. ‘దేవ దేవ ధవళాచల మందిర’... , ‘నీలకంధరా దేవా’..., ‘రాముని అవతారం రవికుల సోముని అవతారం’... పాటలు రంజింప చేస్తాయి. రావణుని తపస్సును భగ్నం చేయడానికి వచ్చిన దేవ కన్యగా సుప్రసిద్ధ డాన్సింగ్ స్టార్ హెలన్ కనిపించి ‘సుందరాంగ అందుకోరా’ పాటలో అలరిస్తుంది. ఆ పాట కూడా హిట్టే. పురాణాల్లో అసురులే గొప్ప దైవభక్తులు. వారి వరాల్లో దోషం వుండొచ్చుగాని వారి భక్తిలో లేదు. ‘భూకైలాస్’ కూడా అటువంటి ఉదంతానికి ఒక ఉదాహరణ. తొలి పూజ గణపతికే ఉత్తర కర్నాటక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున ‘గోకర్ణం’ క్షేత్రం ఉంది. ఇక్కడే ఆత్మలింగ క్షేత్రంగా చెప్పుకునే మహాబలేశ్వర ఆలయం ఉంది. పూర్తిగా భూమిలోకి ఉన్నట్టుగా ఉండే ఈ లింగం నిత్యం నిజ రూపంలో దర్శనం ఇవ్వకపోయినా పన్నెండేళ్లకొకసారి ఇచ్చే నిజ దర్శనంలో దీని పైకొస చేతులతో లాగినట్టుగా ఉండటం చూడవచ్చు. రావణుడి చేతి గుర్తులు ఈ లింగంపై ఉంటాయంటారు. అలాగే ఈ క్షేత్రంలో మహాగణపతి ఆలయం ఉంది. ఆ మూల విరాట్టు శిరస్సు మీద చిన్న సొట్ట ఉంటుంది. ఇది ఆనాడు రావణుడు చేతితో మొట్టడం వల్ల పడిన సొట్టగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా మహా గణపతిని పూజించాలి. ఆనాడు తనకు తొలి పూజ జరగకపోవడం వల్ల కోప్పడిన వినాయకుడు అందుకు ప్రతిఫలంగా ఈనాడు ఇక్కడ తొలిపూజలు అందుకుంటున్నాడన్న మాట. – కె -
'మాట తప్పిన కేసీఆర్ తల తీసేసుకోవాలి'
మహబూబ్నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సీ వేసి వెంటనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించి మాట తప్పిన కేసీఆర్ తలనరుక్కోవాలని డిఎస్సీ సాధనకమిటి అధ్యక్ష, కార్యదర్శులు శివుడు, మల్లేష్లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన 15 నెలల నుంచి ప్రతి నెలా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవి విరమణ పొందుతున్న తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు లేవనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖలో 24,861 పోస్టులు ఉన్నాయని లెక్కలు తేల్చిన ప్రభుత్వం హేతు బద్దీకరణతో 15వేల పోస్టులను మాయం చేసిందని విమర్శించారు. ఇప్పట్లో డిఎస్సీ లేదని విద్యాశాఖమంత్రి ప్రకటించడం నిరుద్యోగులను నిరాశకు గురి చేయడమేనని అన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేనప్పుడు 9,800 ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఎందుకని ప్రశ్నించారు.