హైదరాబాద్: 2014- 15 ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న అమ్మకాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శని వారం ఉత్తర్వులిచ్చింది. పౌర సరఫరాల కమిషనర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఆర్థికశాఖ, ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ నుంచి పలు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మొక్కజొన్న నిల్వల నాణ్య త, ధరలు, అమ్మకాలను పర్యవేక్షిస్తుంది.