పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల ప్రోత్సహానికి కేంద్ర ప్రభుత్వం 13 మందితో కమిటీని నియమించింది.
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల ప్రోత్సహానికి కేంద్ర ప్రభుత్వం 13 మందితో కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, సిక్కిం సీఎం పవన్ కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఇందులో ఉంటారు.
డిజిటల్ నగదు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై కమిటీ సూచనలు, సలహాలు ఇస్తుంది. అంతర్జాతీయంగా అమలవుతున్న నగదు రహిత లావాదేవీలను పరిశీలించిన మన దేశానికి అనువైన విధానాలను సూచించనుంది.