షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితిపై అధ్యయన కమిటీ: చంద్రబాబు
హైదరాబాద్: షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సహకార షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితిపై అధ్యయనానికి కమిటీ నియమించాలని ఈ సమీక్షలో చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులు, సాంకేతిక నిపుణులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ఓ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు. రానున్న 45 రోజుల్లోగా షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితిపై కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని ఆధికారులను చంద్రబాబు ఆదేశించారు.