ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు సమీకరించేందుకు రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముసాయిదా రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ను కమిటీ చైర్మన్‌గా, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్, న్యాయశాఖ కార్యదర్శిని సభ్యులుగా, అడ్వకేట్ జనరల్‌ను ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించింది. గోవా, కేరళ, రాజస్థాన్‌ల్లోని కొత్త చట్టాలను పరిశీలన, అవసరమైతే ఆయా రాష్ట్రాల అధికారులను ఆహ్వానించేందుకు కమిటీకి ప్రభుత్వం అధికారం కల్పించింది.