న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకే వేదికను పంచుకొనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారీ మార్పులను తేవాలని రక్షణశాఖ భావిస్తోంది. అందుకుగాను బైజయంత్ పాండా నేతృత్వంలో ఎన్‌సీసీపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకుగాను అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని రక్షణశాఖ ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీతో, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాలకు కూడా చోటు కల్పించారు.
చదవండి: ఎన్‌ఏఆర్‌సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు కేంద్రం గ్యారంటీ
ఈ కమీటీలో వారితో పాటుగా ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఎంపీ వినయ్ సహస్ర బుద్ధే, ఆర్థికశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్, జామియా మిలియా ఇస్లామియా వీసీ నజ్మా అక్తర్, ఎస్ఎన్‌డీటీ వుమెన్స్ యూనివర్సిటీ మాజీ వీసీ వసుధా కామత్ ఈ కమిటీలో భాగస్వామ్యులుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎన్‌సీసీలో చేయదల్చుకున్న మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. జాతి నిర్మాణంలో ఎన్‌సీసీ క్యాడెట్లు మరింత ప్రభావవంతంగా పాల్గొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. గతంలోని ఎన్‌సీసీలో ఉన్నవారి సేవలను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది.
చదవండి: Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్ లాంచ్‌పై స్పష్టత..!
Comments
Please login to add a commentAdd a comment