
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిపుణుల కమిటీ శనివారం పరిశీలించింది. ప్రాజెక్టులో నీటిని నింపడంపై పలు సూచనలు చేసింది. రిజర్వాయర్ నిర్మాణ డిజైన్స్, డ్రాయింగ్స్, జియాలజిస్టులు ఇచ్చిన టెస్టు రిపోర్టులు, వివిధ ల్యాబ్‌ల నుంచి వచ్చిన రిపోర్టులు, నిర్మాణంలో అనుసరించిన టెక్నికల్ ప్రొసీజర్స్‌ను అధ్యయనం చేసి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దీనిలో ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఈఎన్సీ (గజ్వేల్) హరిరాం, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్‌లు ఉమాశంకర్, శశిధర్ సభ్యులుగా ఉన్నారు.
వీరు రిజర్వాయర్ నిర్మాణ పద్ధతులు, సీవోటీ కట్టింగ్, ప్రాజెక్టు నింపే టైంలో చేయాల్సిన టెస్టులు తదితర అంశాలను పరిశీలించారు. ఇప్పటికే రిజర్వాయర్‌లో 4.90 టీఎంసీలను నింపారు. ప్రాజెక్టు మినిమం డ్రా లెవల్ వరకు నెమ్మదిగా నీటిని నింపాలని వారు సూచించారు. కమిటీ వెంట ప్రాజెక్టు సీఈ చంద్రశేఖర్, ఎస్‌ఈ వేణు, ఇంజనీర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment