బలిజ సంఘం అడ్‌హక్ కమిటీ ఎంపిక
కర్నూలు(అర్బన్): జిల్లా బలిజ సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడంలో భాగంగా యర్రంశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ముందుగా అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌ల్‌లో జిల్లా బలిజ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాపు,తెలగ, బలిజ సంక్షేమ సమాఖ్య సభ్యులు ఎంహెచ్ రావు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కేవీ రావు, పీవీఎన్ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాన్ని పటిష్టపరిచేందుకు గ్రామ, మండల కమిటీల నియామకం పూర్తి అయిన అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. అంతవరకు నల్లగట్ట బాలుడు, భీమలింగప్ప, నంద్యాల గిరిబాబు అడ్‌హక్ కమిటీ సభ్యులుగా విధులు నిర్వహిస్తారని చెప్పారు.
24కేఎన్‌ఎల్42– సమావేశం నిర్వహిస్తున్న బలిజ సంఘం నేతలు