
సాక్షి, న్యూఢిల్లీ : స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (సెజ్) పాలసీని అధ్యయనం చేసేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి భారత్ ఫోర్జ్ సంస్థ చైర్మన్ బాబా కల్యాణీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో 9 మంది ప్రముఖులు, అధికారులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. శ్రీ సిటీ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, హైదరాబాద్ ఫీనిక్స్ డెవలపర్ డైరెక్టర్ శ్రీకాంత్ బాడిగ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న సెజ్ విధివిధానాలను సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలకు అనుకూలంగా నూతన సెజ్ పాలసీని రూపొందించేందుకు ఈ కమిటీ మూడు నెలల్లో సిఫార్సులు సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment