సీఎం చెంతకు ససేమిరా
Published Tue, Nov 15 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
భీమవరం : అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధపడతామే తప్ప.. ఎట్టిపరిస్థితుల్లో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి అంగీకరించేది లేదని పోరాట కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆక్వా పార్క్ నిర్మి ంచడం తమకూ ఇష్టం లేదని భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు స్వరం మార్చగా.. పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తామని ఆచంట ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళదామని ప్రతిపాదించగా.. సీఎం చెంతకు వచ్చేది లేదంటూ పోరాట కమిటీ నాయకులు తెగేసి చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గృహంలో ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులతో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), బండారు మాధవనాయుడు, నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల నుంచి పోరాట కమిటీ ప్రతినిధులు సుమారు 100 మంది హాజరయ్యారు. సీతారామలక్ష్మి ఇంటిచుట్టూ మోహరించిన పోలీసులు పోరాట కమిటీకి చెందిన కొందరు నాయకులతో మాత్రమే ఎమ్మెల్యేలు మాట్లాడతారని, వారు మాత్రమే లోపలికి రావాలని చెప్పారు. దీనిని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరేం మాట్లాడినా అందరి సమక్షంలో మాట్లాడాలని, లేకుంటే తాము చర్చలకు వచ్చేది లేదని భీష్మించారు. దీంతో చేసేదిలేక వచ్చిన వారందరినీ పిలిచి చర్చించారు.
మా శవాలపై కట్టుకోండి
ముందుగా వివిధ గ్రామాలకు చెందిన 12 మంది పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ శవాలపై కట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే కొన్ని పరిశ్రమల వల్ల యనమదుర్రు డ్రెయి¯ŒS పూర్తిగా కలుషితమై అనేక గ్రామాల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, రావులపాలెం మండలం ఈతకోట, నెల్లూరు జిల్లాలో గల రొయ్యల ఫ్యాక్టరీల్లో అమోనియా గ్యాస్ లీకై వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఉద్యమకారులు వివరించారు. వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రెండున్నరేళ్లుగా ఉద్యమం చేస్తుంటే.. మొదట్లో తమకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడు ఆ తరువాత ఎందుకు మాట మార్చారని నిలదీర్చారు.
స్వరం మార్చిన ఎమ్మెల్యేలు
ఉద్యమకారులతో భేటీలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు స్వరం మార్చారు. నిన్నటివరకు ఫుడ్‌పార్క్ నిర్మాణం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన వారిద్దరూ.. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకోబోమని ఉద్యమకారులతో భేటీలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీ కావాలని తాను కూడా కోరుకోవడం లేదన్నారు. ఆక్వాపార్క్ యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణం విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని, పంచాయతీ తీర్మానం అవసరమైనప్పుడు మాత్రమే తాము గుర్తొచ్చామని చెప్పారు. ప్రజలందరి అభిప్రాయమే తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు.
‘నేనూ వ్యతిరేకించా’
గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల తామంతా నష్టపోతామని నరసాపురం నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాల ప్రజలు తనకు చెప్పారని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని అప్పటికప్పుడు ఆదేశించారన్నారు. ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్, కొన్ని పంట కాలువలు కలుషిత కావడం వల్ల తన నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని మాధవనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల నష్టం కలుగుతుందని తేలితే దానిని తాను కూడా వ్యతిరేకిస్తానని స్వష్టం చేశారు.
పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తాం
ఆక్వా పార్క్ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయిస్తామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉద్యమకారులతో జరిపిన భేటీలో ప్రకటించారు. గ్రామాల్లో విధించిన 144 సెక్ష¯ŒS ఎత్తివేతకు కృషిచేస్తామన్నారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు ఒక కమిటీగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరిద్దామని ప్రతిపాదించగా, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఎట్టి పరిస్థితిల్లో చంద్రబాబు వద్దకు వచ్చేది లేదని, ప్రజాప్రతినిధులే ఆయనతో మాట్లాడి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయించాలని కోరారు.
‘హైదరాబాద్ నుంచి వైఎస్ జగ¯ŒS వచ్చారు.. మీరు మాత్రం రాలేదు
ఆక్వాపార్క్ ఉద్యమకారులపై అక్రమంగా పెట్టిన కేసులు, అరెస్ట్‌లతో భయాందోళనలకు గురైన ప్రజలను ఓదార్చేందుకు, వారిపక్షాన నిలబడేందుకు హైదరాబాద్ నుంచి వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి వచ్చారని, జిల్లాలోనే ఉన్న మీరెందుకు రాలేకపోయారని ఉద్యమకారులు ఎమ్మెల్యేలను నిలదీశారు. తమ గ్రామాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే అంజిబాబు, మాధవనాయుడుకు తీరిక దొరకలేదా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగిన మీరు ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులకు, పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కానే కాదని స్పష్టం చేశారు. అయితే, ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఆక్వా పార్క్‌ను ఎట్టిపరిస్థితుల్లో జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు.
Advertisement
Advertisement