చమురు సంస్థల కార్యకలాపాల వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని.. నష్టాలను పార్లమెంటరీ పెట్రోలియం స్టాండింగ్ కమిటీకి చెప్పుకోవాలని, తాము ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టమైన హామీలు పొందాలని ఆశించిన వివిధ వర్గాల ప్రజలకు నిరాశే
-
అంతా పది నిమిషాల్లో ముగించేశారు
-
ఓడలరేవులో పార్లమెంట్ పెట్రోలియం స్టాండింగ్ కమిటీ పర్యటన
-
ఓఎన్జీసీ అధికారులపై వివిధ వర్గాలవారు మండిపాటు
-
బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డంకులు... రాకపోకలపై ఆంక్షలు
-
ఓడలరేవు ప్లాంట్ ముందు ఆందోళన
అమలాపురం/అల్లవరం :
చమురు సంస్థల కార్యకలాపాల వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని.. నష్టాలను పార్లమెంటరీ పెట్రోలియం స్టాండింగ్ కమిటీకి చెప్పుకోవాలని, తాము ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టమైన హామీలు పొందాలని ఆశించిన వివిధ వర్గాల ప్రజలకు నిరాశే ఎదురయింది. మత్స్యకార గ్రామల నుంచి వెల్లువెత్తుతున్న వినతుల నేపథ్యంలో పార్లమెంట్ పెట్రోలియం స్టాండింగ్ కమిటీ మంగళవారం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్‌ను సందర్శించింది. కమిటీ చైర్మ¯ŒS ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, సభ్యులు వి.విజయసాయిరెడ్డి, పండుల రవీంద్రబాబుతోపాటు ఏడుగురు ఎంపీలు వచ్చారు. కమిటీ వస్తుందని
తెలిసి కోనసీమ నలుమూలల నుంచి రైతులు, మత్స్యకారులు, మహిళలు, నిరుద్యోగ యువత ఓడలరేవు ప్లాంట్ వద్దకు చేరుకుంది. తమ కష్టాలను చెప్పుకోవాలని ఆయా వర్గాలవారు ఎంతో ఆశపడ్డారు. ఉదయం పదకొండు గంటలకు వచ్చిన కమిటీ మధ్యాహ్నం మూడున్నర వరకు సుమారు నాలుగున్నర గంటలు ఓడలరేవులో గడిపినా ప్రజల సమస్యలు వినేందుకు మాత్రం కేవలం పది నిమిషాలు మాత్రమే కేటాయించడంతో పెదవివిరిచారు. తమ సమస్యలను వివరిస్తున్న సమయంలో ఓఎన్జీసీ అధికారులు కమిటీ సభ్యులను ప్లాంట్‌లోకి తీసుకుపోవడంతో స్థానికులను విస్మయానికి గురిచేసింది. దీంతో వారు ప్లాంట్ మెయి¯ŒS గేట్ వద్ద ఆందోళనకు దిగారు.
బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు...
కోనసీమ నలుమూలల నుంచి వచ్చినవారిని ప్లాంట్‌కు సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ప్లాంట్ వద్దకు వెళ్లేవారినే కాకుండా బీచ్‌కు, సమీపంలో రిసార్‌్ట్సకు వచ్చినవారిని సైతం వెళ్లనివ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. చివరకు స్థానిక గ్రామస్తులను కూడా ప్లాంట్ వద్దకు వెళ్లనివ్వలేదు. ఈ సమయంలో పోలీసులకు, ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో వెనుకడుగు వేసిన పోలీసులు ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులు చాలా తక్కువమందిని మాత్రమే ప్లాంట్ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. టెర్మినల్ నుంచి బయటకు వచ్చిన స్టాండింగ్ కమిటీ సభ్యులు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు వివరిస్తున్న సమయంలో కొంతమంది బీజేపీ నాయకులు తమ పార్టీకి చెందిన ఎంపీలతో ఫోటోలకు దిగడం ఆయా వర్గాలవారికి ఆగ్రహం తెప్పించింది.
కోనసీమను ముంచేయవద్దు...
‘మా సమస్యలు ఈ రోజువి కావు. ఓఎన్జీసీ కార్యకలాపాలు ఆరంభమైనప్పటి నుంచి ఇవే సమస్యలు. భూమి కుంగిపోతోందని మేము చెబుతున్న విషయం కాదు. జియాలజిస్టులు, శాస్త్రవేత్తల నివేదికలున్నాయి. వరి, కొబ్బరితోపాటు అన్ని పంటలు దెబ్బతింటున్నాయి’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ కిసా¯ŒS సంఘ్, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రతినిధులు రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ‘సిస్మిక్ సర్వే వల్ల మత్స్యసంపద నశించి జీవనోపాధి కోల్పోతున్నాం. ఆ సమయంలో నష్టపరిహారం ఇవ్వడం లేదు. జీఎస్‌పీఎస్ ఇచ్చినట్టుగా ఓఎన్జీసీ కూడా మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలి’ అని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని ‘అసలు మీ ప్రాంతంలో ఎంతమందికి ఓఎన్జీసీ ఉద్యోగాలు ఇచ్చింది?’ అని ప్రశ్నించారు. దీనికి కోనసీమ ఓఎన్జీసీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు స్పందిస్తూ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. సంస్థల వల్ల కోనసీమ మునిగిపోయి 15 లక్షల మంది పొట్ట చేతబట్టుకుని వలసపోయే ప్రమాదం ముంచుకొస్తోంద ని ఆగ్రహంగా మాట్లాడారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదని, ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నా సరైన భద్రతా చర్యలు చేపట్టడం లేదని సూర్యనారాయణరావు ఆరోపించారు. అందరి సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు తాము కృషి చేస్తామని, విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళతామని కమిటీ చైర్మ¯ŒS ప్రహ్లాద్ వెకంటేష్ జోషి, సభ్యులు హామీ ఇచ్చారు. టెర్మినల్‌లో ఓఎన్జీసీ, ఇతర పెట్రోలియం శాఖకు చెందిన అధికారులతో రెండున్నర గంటలపాటు చర్చించారు.అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యేలు మానేపల్లి అయ్యాజీవేమా, రాపాక వరప్రసాద్, ఆల్డా చైర్మ¯ŒS యాళ్ల దొరబాబు, మెట్ల రమణబాబు, రైతు సంఘం ప్రతినిధులు ముత్యాల జిమ్మీ, వాసంశెట్టి సత్యం, జున్నూరి బాబి, కుడుపూడి బాబు, యాళ్ల వెంకటానందం, ఎం.ఎం.ప్రభాకర్, రంబాల బోస్, మత్స్యకార సంఘం ప్రతినిధులు మల్లాడి హనుమంతరావు, కొల్లు సత్యవతి, బీజేపీ నాయకులు ఆర్.వి.నాయుడు, మోకా వెంకట సుబ్బారావు, యల్లమిల్లి కొండలు పాల్గొన్నారు.