- పల్లెపల్లెకూ చంద్రబాబు మోసాలు
- క్షేత్రస్థాయిలో యువజన విభాగం పటిష్టం
- అ«ధ్యక్షుడు అనంతబాబు
రేపు వైఎస్సార్‌సీపీ యువజన సమావేశం
Published Sat, Sep 24 2016 10:36 PM | Last Updated on Tue, May 29 2018 3:36 PM
సాక్షిప్రతినిధి, కాకినాడ:
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను వాడవాడలా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎండగట్టనున్నట్టు ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) చెప్పారు. శనివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇందుకు కార్యచరణ రూపొందించేందుకు ఈ నెల 26న పిఠాపురంలో యువజన విభాగం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పిఠాపురం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, స్థానిక కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని అనంతబాబు చెప్పారు. ఈ సమావేశానికి యువజన విభాగం మండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు విధిగా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement