'త్వరలోనే ఆ సినిమా చూస్తా'.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్! | Tollywood Hero Mahesh Babu Congratulates Committee Kurrollu Movie Team, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Mahesh Babu: 'త్వరలోనే మీ సినిమా చూస్తా '.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్!

Published Mon, Aug 12 2024 10:51 AM | Last Updated on Mon, Aug 12 2024 11:04 AM

Tollywood Hero Mahesh Babu Congratulates Committee Kurrollu Team

నిహారిక తొలిసారి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతా కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తానంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా.. ఈ చిత్రానికి ప్ర‌శంస‌ల‌తో పాటు సినిమాకు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీతారలు సైతం కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని కొనియాడారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఈ మూవీలో న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ అంతా కొత్తవారే కావడం విశేషం. ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement