సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు. రేపు(మంగళవారం) కాళేశ్వరం డ్యామ్‌ను కేంద్ర బృందం సందర్శించనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా.
చదవండి: సీఎం కేసీఆర్ ధైర్యం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment