medigadda
-
‘మేడిగడ్డ’పై ఇక నివేదికలు అక్కర్లేదు!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల కింద ఏర్పడిన బుంగలను తమ సిఫార్సులకు విరుద్ధంగా నీటిపారుదల శాఖ గ్రౌటింగ్ ద్వారా పూడ్చేయడంతో భూగర్భంలోని స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపు ణుల కమిటీ వెల్లడించింది. ఇప్పుడు పరీక్షలు నిర్వహించినా బరాజ్‌ల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవ కారణాలను తెలుసుకోలేమని తేల్చిచెప్పింది. అందువల్ల గతంలో తాము మధ్యంతర నివేదికలో నిర్దేశించిన వివిధ పరీక్షలు, అధ్యయనాల జాబితా నుంచి 5 రకాల అధ్యయన నివేదికలను ఇక సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.తాము సూచించిన అధ్యయనాలను సకాలంలో చేపట్టి నివేదికలను సమర్పించడంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ తాత్సారం చేస్తోందని తప్పుబట్టింది. ఈ మేరకు నిపుణుల కమిటీ సభ్య కార్యదర్శి/ఎన్డీఎస్ఏ డైరెక్టర్ గత నెల 29న ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు తన అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ తాత్సారం వల్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తాము తుది నివేదిక సమర్పించేందుకు మరింత ఆలస్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై మిగిలిన నివేదికలైనా సకాలంలో సమర్పించేలా తెలంగాణ నీటిపారుదల శాఖపై ఒత్తిడి తేవాలని ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను అయ్యర్ ఈ నెల 2న నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపారు. సత్వరమే కోరిన సమాచారాన్ని అందజేయాలని సూచించారు. డిసెంబర్ 31లోగా తుది నివేదిక అనుమానమేగత వానాకాలానికి ముందు బరాజ్‌లకు నిర్వహించాల్సిన తాత్కాలిక మరమ్మతులతోపాటు వాటిలోని లోపాలను గుర్తించడానికి చేపట్టాల్సిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్దేశిస్తూ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏప్రిల్ 30న మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏకు సమర్పించింది. బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అధ్యయనాలు అత్యవసరమని అప్పట్లో తెలిపింది. అయితే వానాకాలంలోగా నీటిపారుదల శాఖ ఆయా అధ్యయనాలను చేపట్టి నివేదించకపోవడంతో నిపుణుల కమిటీ తుది సిఫార్సుల గడువును అక్టోబర్ 31 నుంచి ఎన్డీఎస్ఏ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 31లోగా తుది నివేదిక సమర్పించే అంశంపై నిపుణుల కమిటీ పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసింది. -
మేడిగడ్డ ఏఈఈ, డీఈఈపై జస్టిస్ ఘోష్ అసహనం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముందు ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈఈ, ఏఈఈలు హాజరయ్యారు. అయితే కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కమిషన్ ముందు వాళ్లు వివరణ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జస్టిస్ చంద్రఘోష్ అసహనానికి లోనయ్యారు. ‘‘ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి. ముందుగా అనుకొని వచ్చి.. పొంతనలేని సమాధానాలు చెప్పొద్దు’’ అని మందలించారాయన. ఆపై.. నిర్మాణం, పనుల వివరాలు ఆరా తీశారు.కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా? ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారని అని ప్రశ్నించారు. మేడిగడ్డపై కుంగినటువంటి పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ సెవెన్ రిజిస్టర్ లపై ఈ ఇద్దరు ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు.ఇక.. 2020లోనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజినీర్లు, కమిషన్ ముందు చెప్పారు.కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మొదటి రోజు ఇంజనీర్లతో ముగిసింది. AEE - DEE - EE - CE CDO.. ఇలా మొత్తం 18 మంది ఇంజనీర్‌స్థాయి అధికారులను స్వయంగా విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. రేపు (మంగళవారం) మరో 15 మందిని విచారిస్తారని సమాచారం. -
వాటిల్లో నీటి నిల్వ ప్రమాదకరం
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ సహా అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో ఇప్పటికిప్పుడు నీటిని నిల్వ చేయడం ప్రమాదకర మని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఈ మూడు బరా జ్‌ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ నిర్మాణం జరిగినందున నీటిని ఏమాత్రం నిలువచేసినా బరాజ్‌ల మనుగడకే ముప్పని వెల్లడించింది. ప్రస్తుతం దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌లో వినియోగించిన సాంకేతికతనే మిగతా బరాజ్‌ల్లో నూ వినియోగించినందున ప్రమాదాలకు ఆ స్కారం ఉందని వివరించింది. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఈఎన్సీలు అనిల్, నాగేందర్రావు, సుధాకర్ రె డ్డిలు శుక్రవారం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తో పాటు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో సమావేశమయ్యా రు. బరాజ్‌లకు సంబంధించి ఎన్డీఎస్ఏ సమర్పించాల్సిన తుది నివేదికలపై చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించండి: మంత్రి ఉత్తమ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బరాజ్ నుంచి నీటి ఎత్తిపోసే అవకాశం లేనందున, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ మినహా ఇతర బరాజ్‌ల నుంచి ఎల్లంపల్లి, మిడ్ మానేరుకు నీటి ఎత్తిపోతలపై ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని కోరారు. దీనిపై ఎన్డీఎస్ఏ అధికారులు స్పందిస్తూ.. మిగతా బరాజ్‌ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ సాంకేతికతనే వినియోగించినందున ప్రమాదాలకు అవకా శం ఉందని, దిగువన ఉన్న సమ్మక్క సారక్క బరాజ్ సహా భద్రాచలం ఆలయం వరకు పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసినట్టు తెలిసింది.దీనిపై అన్ని అంశాలను విశ్లేíÙంచి డిసెంబర్ లోగా తుది నివేదికను సమరి్పస్తామని, అప్పటిలోగా ఎలాంటి నీటి నిల్వ చేయొద్దని సూచించినట్టు సమాచారం. దీంతో తుది నివేదిక సత్వరమే వచ్చేలా చూడాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బరాజ్‌లకు తాత్కాలిక మరమ్మతులు చేసిందని చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధి భేష్: ఎన్డీఎస్ఏ తాత్కాలికంగా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద చిన్న తరహా నిర్మాణాన్ని చేసుకుని రాష్ట్ర రబీ, తాగునీటి అవసరాలకు అక్కడి నుంచి నీటిని తరలించుకునే అవకాశాలు సూచించాలని మంత్రి ఉత్తమ్‌తో పాటు రాష్ట్ర అధికారులు కోరినట్టు తెలిసింది. లక్ష కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి చెప్పినట్లు సమాచారం. దీనిపై ఎన్డీఎస్ఏ స్పందిస్తూ.. గతంలో బరాజ్ నిర్మాణ సంస్థతో పాటు ప్రభుత్వం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కారణంగానే బరాజ్‌లను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందని, తాము తుది అభిప్రాయం వెల్లడించే వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టును వీలైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చే విషయంలో మంత్రి, ప్రభుత్వ చిత్తశుద్ధిని అభినందించినట్లు సమాచారం. -
ఆగస్టు 2 డెడ్‌లైన్
సాక్షి ప్రతినిధి, వరంగల్/గోదావరిఖని: గోదావరి నిండుగా పారుతున్నా కన్నెపల్లి (మేడిగడ్డ (లక్ష్మీ)) పంపుహౌస్ నుంచి నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం (క్రిమినల్ నెగ్లిజెన్సీ) ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. దేశం గర్వించే విధంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నామ్ చేయాలనే రాజకీయ దురుద్దేశంతో రైతులకు నష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.ఆగస్టు 2 వరకు కాళేశ్వరం బరాజ్‌ల్లో నీరు నింపాలని, లేదంటే 50 వేల మంది రైతులతో తరలివచ్చి తామే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం బరాజ్‌ల సందర్శనకు బయలుదేరి గురువారం రాత్రి గోదావరిఖని ఎనీ్టపీసీ జ్యోతిభవన్‌లో బస చేసిన కేటీఆర్..శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, మేడిగడ్డ బరాజ్‌లను, పంపుహౌస్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో మీడియాతో మాట్లాడారు ప్రభుత్వానికి నీళ్లిచ్చే ఉద్దేశం లేదు.. ‘రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం లేదు. డిసెంబర్–జనవరిలలోనే నీరివ్వాలని ప్రభుత్వానికి సూచించినా భేషజాలకు వెళ్లి యాసంగి పంటలను ఎండబెట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, సింగూరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఎండిపోతున్నా కేవలం రాజకీయ దురుద్దేశంతో వాటిని నింపే ప్రయత్నం చేయడం లేదు. వానాకాలంపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితిని కలి్పస్తున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 70–80 టీఎంసీలు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా.. ‘తెలంగాణలో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 70–80 టీఎంసీల నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలేరు, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, ఆదిలాబాద్, హుజూరాబాద్, హుస్నాబాద్, గజ్వేల్, భువనగిరి.. ఇలా తెలంగాణలోని మెట్ట ప్రాంతాల కు సాగునీరు అందించే అవకాశం ఉంది.ఇందుకోసం రోజు కు రెండు, మూడు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తే మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను గోదావరి నీటితో నింపొచ్చు. పైన ఉన్న సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లలోనూ నీళ్లు లేవు, వీటికీ కాళేశ్వరమే ఆధారం. మరో ప్రత్యామ్నా యం లేదు. ఇవన్నీ తెలిసినా రాజకీయం కోసం రైతులు, ప్ర జలను వంచిస్తున్నారు..’అని మాజీమంత్రి ధ్వజమెత్తారు.ఎన్డీఎస్ఏ రిపోర్టు ఓ ఫార్స్‘నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్టు ఓ ఫార్సు. ఆ నివేదికను సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఐదేళ్లు గడు స్తున్నా ఇంకా రిపోర్టు ఇవ్వలేదు. కాళేశ్వరంపై మాత్రం కనీసం ప్రాజెక్టును పరిశీలించకుండా ఒక్కరోజులోనే నివేదిక ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఒకే విధంగా ఉంది. కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పంప్‌హౌస్‌లు ఆన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజనీర్లు చెప్పారు. నీటిని లిఫ్ట్ చేస్తే రెండు రోజుల్లో మిడ్ మానేరుకు చేరుకుంటాయి.దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉదయం గోదావరిఖని నుంచి చెన్నూరు మీదు గా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లిన కేటీఆర్ దారిలో గోదావరి బ్రిడ్జి వద్ద కొద్దిసేపు ఆగి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడ వరద లేకపోవడంతో..ప్రస్తుత ప్రభుత్వ తీరుతో గోదావరి నదిలో చిల్లర నాణేలు సమరి్పంచేందుకు నీరు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వ ర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, గోరటి వెంకన్న, వాణిదేవి, ఎలగందుల రమణ, బాల్క సుమన్, దివాకర్‌రావు, చిన్నయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, ముఠా గోపాల్, కోవ లక్ష్మీ, విజయుడు ఉన్నారు. -
అన్ని గేట్లు ఎత్తి పెట్టాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ సహా మిగతా రెండు బరాజ్‌ల గేట్లను పూర్తిగా ఎత్తి పెట్టాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్ర ప్రభుత్వానికి తేలి్చచెప్పింది. ప్రస్తుతం బరాజ్‌ల్లోకి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేయాలని సూచించింది. సోమవారం మరోమారు ఇంజనీర్ల స్థాయిలో చర్చించి, తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని తెలిపింది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌తో సమావేశమయ్యారు.మంత్రితో పాటు నీటి పారుదల శాఖ కార్యదర్శులు రాహుల్ బొజ్జ, ప్రశాంత్ జీవన్ పాటిల్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, కాళేశ్వరం సీఈ సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులు, నీటి తరలింపు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల్లో మరమ్మతులు, పునరుద్ధరణలో భాగంగా ఎన్డీఎస్ఏ సూచనల మేరకు చేపట్టిన పనుల వివరాలను ఇంజనీర్లకు వివరించారు.సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్‌ఎమ్మార్‌ఎస్‌కు సంబంధించిన నివేదికలు పూర్తి స్థాయిలో అందనందున బరాజ్‌ల్లో నీటి నిల్వలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం చేయలేమని, ఈ దృష్ట్యా అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడమే ఉత్తమమని ఎన్డీఎస్ఏ చైర్మన్ స్పష్టం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భేటీ వివరాలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకు: ఉత్తమ్ కాళేశ్వరం బరాజ్‌ల విషయంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ముందుకు వెళతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘బరాజ్‌లో నీటి నిల్వలు, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించాం. ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల మేరకు ఇప్పటికే చేపట్టిన పనులను, పరీక్షలను వివరించాం. ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పాం. దీనిపై వారు ఇప్పటికైతే అన్ని గేట్లు ఎత్తిపెట్టి నీళ్లు కిందకి వదిలేయండని చెప్పారు. దానికి అనుగుణంగానే అన్ని గేట్లు ఎత్తినీటిని వదిలేస్తాం.దీనిపై కేబినెట్లోనూ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం’అని వివరించారు. మేడిగడ్డలో మాత్రం ఒక గేటు పనిచేయడం లేదని, దానిని పూర్తిగా కట్ చేసి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మేడిగడ్డతో పాటు అన్నారంలో సీపేజీలను, సుందిళ్లలో కొన్ని లోపాలను కేంద్ర సంస్థ గుర్తించిందని, ప్రజా జీవితాలకు సంబంధించిన విషయమైనందున నిపుణుల సూచన మేరకే ముందుకెళ్తామన్నారు. ఎల్లంపల్లి ఎగువన నీటిని వినియోగించుకొని, ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. కుంగిందెప్పుడు..ఆర్కిటెక్ట్ ఎవరు..? ఈ సందర్భంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్‌ని వినియోగించుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘కేవలం కమిషన్ల కోసం తుమ్మడిహెట్టి డిజైన్‌ను మేడిగడ్డకు మార్చారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యేదాన్ని రూ.1.50లక్షల కోట్లకు పెంచారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని తప్పుడు లెక్కలు చెప్పారు.తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చని అంచనా వేస్తే, ఇప్పుడు కాళేశ్వరంతో ఏటా ఖర్చు రూ.10వేల కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులపై వడ్డీలకే ఏటా రూ.15వేల కోట్లవుతున్నాయి. ఇంతా చేసి ఏడాది 13 టీఎంసీల చొప్పున ఐదేళ్లలో 65 టీఎంసీలు ఎత్తిపోశారు. దీనికి కర్త, ఆర్కిటెక్ట్, బిల్డర్ అన్నీ కేసీఆర్ అన్ని గొప్పలు చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగితే మాత్రం ఒక్క మాట మాట్లాడలే. ప్రాజెక్టు నాశనం చేసిన వాళ్లే ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు. అబధా్ధలు చెప్పడానికైనా కేటీఆర్‌కు హద్దుండాలి’అని ఉత్తమ్ విరుచుకుపడ్డారు. మా హయాంలోనే తుమ్మిడిహెట్టి పూర్తి.. ఇక తమ హయాంలోనే తుమ్మిడిహెట్టి బరాజ్‌ని పూర్తి చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్ర స్తుత వరద దృష్ట్యా ఏ ప్రాజెక్టులోనూ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఇంజనీర్లను అప్రమత్తం చేశామన్నారు. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజె క్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు అని, 90 శాతం ఆయకట్టు ఏపీలో ఉందని, ఐదు అడుగుల మేర వరద రావడంతో అక్కడ కొన్ని ఇక్కట్లు ఎదురయ్యాయని ఉత్తమ్ వెల్లడించారు. -
శరవేగంగా మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ
-
త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. వానాకాలం ప్రారంభానికి ముందే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. తాను, సీఎం రేవంత్‌రెడ్డి కలసి నాలుగైదు రోజుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శనకు వచ్చి పునరుద్ధరణ పనులను పరిశీలిస్తామని చెప్పారు.గురువారం సచివాలయంలో నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు, మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ డైరెక్టర్ దేశాయ్‌లతో ఉత్తమ్ సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో నంబర్ బ్లాకులోని గేట్లను పైకి ఎత్తే ప్రక్రియను ప్రారంభించామని మంత్రికి ఎల్అండ్టీ సంస్థ డైరెక్టర్ వివరించారు. బ్యారేజీకి గ్రౌంటింగ్ పూర్తి చేయడంతోపాటు ఏడో బ్లాకు పునాదుల కింద షీట్‌పైల్స్ వేస్తామని తెలిపారు.తర్వాత ఏడో నంబర్ బ్లాకులో పగుళ్లు వచ్చిన 19, 20, 21 నంబర్ పియర్ల మధ్య ఉన్న గేట్లను సైతం ఎత్తుతామని వెల్లడించారు. షీట్‌పైల్స్‌ను తయారు చేయించి ఇప్పటికే బ్యారేజీ వద్దకు తెప్పించామన్నారు. ఇక సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ఎగువ, దిగువ భాగంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయని.. చెల్లాచెదురైన సీసీ బ్లాకులను పూర్వస్థితికి చేర్చే పనులు జరుగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. బ్యారేజీల్లో బోర్లు వేసి పరీక్షలు.. జేఎస్ ఎడ్లబడ్కార్ (జియో టెక్నికల్ పరీక్షల నిపుణురాలు), ధనుంజయ నాయుడు (జియో ఫిజికల్ పరీక్షల నిపుణుడు), ప్రకాశ్ పాలీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ నిపుణుడు)తో కూడిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణుల బృందం గురువారం జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేంద్రరావులతో సమావేశమైంది. బ్యారేజీల పరిశీలనలో తమ దృష్టికి వచి్చన అంశాలు, వాటికి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ చేసిన ప్రతిపాదనలపై తమ సంస్థ డైరెక్టర్‌కు త్వరలో నివేదిక సమరి్పస్తామని ఈ బృందం తెలిపింది.కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు నిర్వహించనున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల కోసం బ్యారేజీల లోపల బోర్లను వేయాలని సూచించింది. బోరు రంధ్రాల నుంచి అధునాతన పరికరాల ద్వారా శబ్దాలు పంపించడం ద్వారా.. బ్యారేజీల కింద భూగర్భంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను గుర్తించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. టెస్టుల్లో భాగంగా బోర్లు వేయడం, ఇతర పనులను నీటిపారుదల శాఖే నిర్వహించాలని.. తమ నిపుణులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. రేపు ఎన్జీఆర్ఐ బృందం పరిశీలన హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసె ర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణుల బృందం శనివారం మూడు బ్యారేజీలను పరిశీలించనుంది. సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్‌జీఆర్‌ఐతోపా టు ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్)తో బ్యారేజీలకు పరీక్షలు జరపాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. -
కాళేశ్వరం పరిశీలించిన శాస్త్రవేత్తలు
-
త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండగా, ఆలోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతుతపై రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు.బ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించాలా? ఇతర ప్రత్యా మ్నాయాలు ఏమైనా ఉన్నాయా? బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలి? అనే అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి నిర్ణ యాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలో కాళే శ్వరం బ్యారేజీలు, వాటికి సంబంధించిన పంప్ హౌస్‌లను పరిశీలి స్తామని వెల్లడించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో సీఎం, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మ ల నాగేశ్వ రరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నిపుణుల కమిటీ సిఫారసులు వివరించిన ఉత్తమ్గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పలుమార్లు బుంగలు పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసింది.ఈ కమిటీ ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బ్యారేజీలకు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులను, తీసుకోవాల్సిన రక్షణ చర్యలను సిఫారసు చేసింది. ఈ అంశాలన్నిటినీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సీఎం, ఇతర మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలు ప్రమాద సంకేతాలు వెలువరించాయని, ఇప్పుడు మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు ఉండదనే అంశాన్ని తోసిపుచ్చలేమని నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్టుగా మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. -
‘కాళేశ్వరా’నికి హాలిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురితో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ విధాన, పరిశోధన విభాగం డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిత్తల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మూడు బ్యారేజీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు చేయాలని... 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించి నివేదిక సమర్పించాకే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఆస్కారముందని ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే 4 నెలలపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసులకు అనుగుణంగా జూలై తొలి వారం తర్వాతే పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ సిఫారసులు, సూచనల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న కమిటీ బ్యారేజీల పరిశీలనకు రానుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కమిటీలో కీలక విభాగాల నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై ఏర్పాటైన కమిటీలో పలు కీలక విభాగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యు.సి. విద్యారి్థ, పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్.పాటిల్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (బీసీడీ) శివకుమార్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ (గేట్స్)/ఎన్డీఎస్ఎఏ డైరెక్టర్ (విపత్తులు) రాహుల్ కుమార్‌సింగ్‌లు ఈ కమిటీ సభ్యులుగా, ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా కమిటీ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే లోపాలను నిర్ధారించిన ఓ కమిటీ... గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీక్ అయ్యాయి. ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గతంలో ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. అన్నారం బ్యారేజీ పునాదుల దిగువన పాతిన సెకెంట్ పైల్స్కి పగుళ్లు రావడంతోనే బ్యారేజీలో పదేపదే బుంగలు ఏర్పడుతున్నాయని మరో నివేదికలో స్పష్టం చేసింది. మూడు బ్యారేజీలను ఒకే తరహాలో డిజైన్, సాంకేతికతతో నిర్మించినందున మూడింటిలోనూ లోపాలు ఉంటాయని, అన్నింటికీ జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలపై సమగ్ర అధ్యయనం జరిపి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. డ్యామ్ సేఫ్టీ చట్టం–2021లోని 2వ షెడ్యూల్లోని 8వ క్లాజు కింద ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్ఏ నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలపై అధ్యయనం కోసం కమిటీకి ఎన్డీఎస్ఏ జారీ చేసిన విధివిధానాలు.. ► మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తనిఖీలు నిర్వహించాలి. బ్యారేజీల స్థలం, హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను నిర్ధారించడానికి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇతర భాగస్వామ్యవర్గాలతో చర్చించాలి. ► ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్, డిజైన్ల నివేదికలు, పరీక్షలు, స్థల తనిఖీ నివేదికలు, బ్యారేజీల తనిఖీ నివేదికలు, మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నాణ్యత హామీల నివేదికలను పరిశీలించాలి. ► బ్యారేజీ నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఇతర వ్యవహారాల్లో పాలుపంచుకున్న భాగస్వామ్యవర్గాల (ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు)తో సంప్రదింపులు జరపాలి. ► బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు దోహదపడిన భౌతిక/గణిత నమూనా అధ్యయనాలను పరిశీలించాలి. (బ్యారేజీల డిజైన్ల రూపకల్పనకు ముందు ప్రయోగాత్మకంగా ల్యాబ్స్‌లలో నమూనా బ్యారేజీలను రూపొందించి వరదలను తట్టుకోవడంలో వాటి పనితీరును పరీక్షిస్తారు) ► మూడు బ్యారేజీల్లోని సమస్యలను గుర్తించి నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలు, చేపట్టాల్సిన తదుపరి అధ్యయనాలు/పరిశోధనలను సిఫారసు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను సూచించాలి. -
నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న భారత రాష్ట్ర సమితి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శిస్తుంది. ఉదయం 8.30కు తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరే ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక బ్లాక్‌లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజూ ఐదువేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది. మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీని కూడా ఈ బృందం సందర్శిస్తుంది. అన్నారం బ్యా రేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై పవర్ పాయింట్ప్రజెంటేషన్ ఇస్తారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థితిగతులను మీడియా కు వివరిస్తారు. బీఆర్ఎస్ బృందంతో కొందరు సాగునీటిరంగ నిపుణులు కూడా మేడిగడ్డను సంద ర్శిస్తారు. త్వరలో మరికొందరు నిపుణులు కూడా వి.ప్రకాశ్ నేతృత్వంలో సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్టీ స్తారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టులో లోపాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ సందర్శన ద్వారా వాస్తవాలను వెల్లడిస్తామని బీఆర్ఎస్ చెప్తోంది. ఓ వైపు దెబ్బతిన్న బ్యారేజీకి మరమ్మతులు చేస్తూనే మరోవైపు కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోయొచ్చని బీఆర్ఎస్ చెప్తోంది. మేడిగడ్డ మరమ్మతుల పట్ల రాష్ట్ర ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు నేరుగా, సోషల్ మీడియా ద్వారా వివరిస్తామని చెప్తోంది. తొలిసారి కేటీఆర్ రాక.. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి మంత్రి హరీశ్‌రావు ప దుల సార్లు వచ్చి పనులను పరిశీలించారు. కానీ కేటీఆర్ రాలేదు. ప్రస్తుతం బ్యారేజీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా కేటీఆర్ బ్యారేజీ వద్దకు రానున్నారు. -
వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కొత్త చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్‌్కఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్ఎంబీ అధికార పరిధి, కేఆర్ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్‌లపై శ్రీరామ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. ఎన్డీఎస్ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. ప్లంజ్‌పూల్‌తో ప్రమాదం శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్‌పూల్ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్‌ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల పూర్తికి మరో రూ.97 వేల కోట్లు అవసరమని, ఖర్చు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై చేసిన 1.81 లక్షల కోట్ల వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందని పేర్కొంది. ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మాణం కొనసాగిన, పూర్తయిన, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, వ్యయం, సాగులోకి వచ్చిన ఆయకట్టు వంటి అంశాలను అందులో వెల్లడించింది. గత సర్కారు అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగి, పగుళ్లు వచ్చిందని.. మరో రెండు బ్యారేజీలు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 2014 వరకు రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. 2014 తర్వాత అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టుల ను నిర్మించడం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని తెలిపింది. వచ్చే పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని వివరించింది. ప్రాజెక్టులపై శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు.. ► 2014కు ముందు ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు రూ.54,234 కోట్లు. ► 2014–2023 మధ్య రూ.1.81 లక్షల కోట్ల వ్యయంతో.. 15.81 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ► కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల కోసం రూ.1.29 లక్షల కోట్ల ఖర్చు జరిగింది. ► రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు అంచనా 1.27 కోట్ల ఎకరాలు.. ఇప్పటికే ఉన్న ఆయకట్టు 73.6 లక్షల ఎకరాలు. ► ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి మిగతా 53.98 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే రూ.97,774 కోట్లు కావాలి. ► వచ్చే ఐదేళ్లలో అప్పులు, వడ్డీల కింద రూ.77,369 కోట్లు చెల్లించాలి. ► కాళేశ్వరానికి రూ.93,872 కోట్లు ఖర్చుచేసి 98,590 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చారు. ► పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు రూ.36 వేలకోట్లు వ్యయం చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ► పదేళ్లలో కృష్ణాజలాల దోపిడీ 4 రెట్లు పెరిగింది. ► సాగునీటికోసం ఉద్యమించిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఒంటెద్దు పోకడ పోయింది. ► కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి గత ప్రభుత్వం 2015లోనే అంగీకరించింది. ► శ్రీశైలం నుంచి రోజుకు 9.3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వం సహకరించింది. ► పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీ సామర్థ్యానికి కుదించింది. ► గత ప్రభుత్వ తీరువల్ల శ్రీశైలంపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ► కృష్ణా నీటి వాటాల్లో మనకు అన్యాయం జరిగింది. న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోయాం. ► జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహెట్టి వద్ద రూ.38,500 కోట్లతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. 160 టీఎంసీలు ఎత్తిపోసి, 16 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూపొందించింది. ► ఎల్లంపల్లికి ఒకదశలో నీటిని పంపు చేయాల్సిన చోట రీడిజైన్ చేసి అనవసరంగా వ్యయం పెంచారు. ప్రాణహిత–చేవెళ్లకు విద్యుత్ వ్యయం ఏటా రూ.1,010 కోట్లు అయి ఉండేది. కాళేశ్వరం ద్వారా రూ.10వేల కోట్లు అవుతోంది. ► కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు 162.36 టీఎంసీలు ఎత్తిపోసి.. అందులో 30 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. ► ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ నియంత్రణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ► మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ దెబ్బతిని, పిల్లర్స్ కుంగి కదిలిపోయాయి. ఈ బ్యారేజీలోని లోపం మొత్తం ప్రాజెక్టు పనితీరుపైనే ప్రభావం చూపు తుంది. విజిలెన్స్ నివేదిక సైతం లోటుపాట్లను సవివరంగా వెల్లడించింది. ► కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉంది. పాలమూరు–రంగారెడ్డికి ఏఐ బీపీ కింద నిధులు తెస్తాం. కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటివాటా కోసం చర్యలు తీసుకుంటాం. -
రాష్ట్రానికి చెదలు పట్టించింది మీరే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయిని కాదని, అది తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్, హరీశ్ కలసి తెలంగాణకు చెదలు పట్టించారని, వారు ఎంత ద్రోహం చేశారో ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ పుర్రెలోనే పురుగులా పుట్టిందని, ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారని విమ ర్శించారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు అవాంఛనీయమని, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని ఐదుగురు సభ్యుల రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పినా పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఖజానాను కొల్లగొట్టడానికే దుర్మార్గానికి తెగబడ్డారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతున్న సమయంలో.. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించింది. నాడు ప్రాణహిత నది మీద తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కడితే 1,850 ఎకరాల పట్టా భూమి మునుగుతుందని, గ్రామాలేవీ ముంపునకు గురికావని తేల్చారు. అదే 150 మీటర్ల ఎత్తుతోనే కడితే 1,250 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని గుర్తించారు. ప్రాణహిత–చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు నాటి మహారాష్ట్ర సీఎంతో, ఉమ్మడి ఏపీ సీఎం చర్చించారు. 2012లో స్టాండింగ్, కో–ఆర్డినేషన్ కమిటీలు వేశారు. మేడిగడ్డ నిరుపయోగమని చెప్పినా.. తెలంగాణ వచ్చాక అప్పటి సీఎం కేసీఆర్, సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు.. గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్ బి.అనంతరామ్ నేతృత్వంలో ఐదుగురు ఇంజనీర్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ 14 పేజీలతో నివేదిక ఇచ్చింది. అప్పటికే శంకుస్థాపన కూడా చేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కాకపోతే 150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించాలని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు అవాంఛనీయమని తేల్చి చెప్పింది. అయినా మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టడం సరికాదంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇచి్చన నివేదిక ఆధారంగా 2015 సెపె్టంబర్లో ‘సాక్షి’ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. సభలో క్షమాపణలు చెప్పాలి కేసీఆర్, హరీశ్ కలసి ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టి.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు చేపట్టారు. రూ.38వేలకోట్ల నుంచి రూ. 1.47 లక్షల కోట్లకు అంచనాలను పెంచేశారు. తెలంగాణ ఖజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగబడ్డారు. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీశ్‌రావుకు గౌరవం ఉండేది. కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశి్నస్తారా? ప్రాజెక్టులు ఫక్కున పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా ఇంకా వాదిస్తారా? హరీశ్‌రావును నేను నిలదీస్తున్నా.. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు వద్దు. ప్రాణహిత–చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. నాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క ఇప్పుడు మౌనంగా హరీశ్‌రావు గారిని సమరి్ధస్తున్నారా? జరిగిన తప్పులకు హరీశ్ క్షమాపణ చెప్పాలి. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి విచారణకు వచ్చినపుడు.. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో నాటి మంత్రులు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చి తప్పులు ఒప్పుకోవాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంతోపాటు సభను సజావుగా నడిపించడంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను మాజీ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రేవంత్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సాగునీటి రంగంపై శాసన సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చ నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం ఈ మేర కు ప్రకటన చేశారు. కేంద్రమంత్రి, మంత్రి, సీఎంగా వివిధ హోదాల్లో 40 ఏళ్లు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తన పాత్ర పోషించారని తెలిపారు. -
మేడిగడ్డ పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి
-
కేసీఆర్ కోసం హెలికాప్టర్ సిద్ధం
-
అన్ని పార్టీల సభ్యులు మేడిగడ్డకు రావాలి: శ్రీధర్ బాబు
-
Congress vs BRS: ఇరిగేషన్ వార్ తారాస్థాయికి..
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ నుంచి సీన్ మారి రోడ్డెక్కింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల నడుమ నీళ్ల నిప్పులు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మంగళవారం పోటాపోటీ ప్రదర్శనలకు ఇరు పార్టీలు సిద్ధం అయ్యాయి. ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పైచర్చ జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మేడిగడ్డ సందర్శనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాజెక్టు సందర్శనకు ప్రజాప్రతినిధులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. దీంతో అంతా బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు బయల్దేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులంతా రోడ్డు మార్గాన బస్సుల్లో రావాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నాం మూడు గంటల ప్రాంతంలో బస్సులు మేడిగడ్డకు చేరుకోనున్నాయి. గంటన్నర పాటు ప్రాజెక్టును, పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులంతా సందర్శిస్తారు. ఆపై సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఎంఐఎం సభ్యులు సైతం మేడిగడ్డ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి కేసీఆర్ సభ మరోవైపు కృష్ణా నది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు - KRMBకి అప్పగించడంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మర్రిగూడ బైపాస్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గం. ప్రాంతంలో ఈ సభ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభ ఇదే కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నల్లగొండ, ఖమ్మంల నుంచి 2 లక్షల మంది సభకు తరలించాలని నిర్ణయించింది. ఈ సభలో కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు వివరిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. నల్లగొండలో ఉద్రిక్తత! కేసీఆర్ సభకు కౌంటర్‌గా.. నల్లగొండ క్లాక్ టవర్‌లో మినీ సభకు కాంగ్రెస్ సిద్ధమైంది. గత పదేళ్లలో కృష్నా జలాల విషయంలో బీఆర్ఎస్ అవలింభించిన విదాల్ని వివరించడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంపైనా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధమైంది. అలాగే.. కేసీఆర్ కోసం గులాబీ కుర్చీ, కండువాను సిద్దం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. దీనిని బీఆర్ఎస్ అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మేడిగడ్డకు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ వ్యూహం అదేనా..?
-
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నెల 13వ తేదీన మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ పర్యటనలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రాజెక్టు సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ను ఆహ్వానించే భాద్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 12వ తేదీతో ముగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో ఇరిగేషన్‌పై చర్చ జరగనుంది. విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. ఈ నెల 13న చేపట్టనున్న మేడిగడ్డ సందర్శనకు అటు.. బీజేపీ నేతలు కూడా సై అంటున్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రాజెక్టును సందర్శిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టులో వరదలు కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ ఇటీవల అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది. ఇదీ చదవండి: Vote for Crore : ఓటుకు కోట్లు కేసులో సుప్రీం నోటీసులు -
మేడిగడ్డ చూద్దాం రండి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ వాస్తవ పరిస్థితి పరిశీలనకు ఈనెల 13వ తేదీన అన్ని పక్షాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డ మేడిపండు ఎలా అయిందో అందరూ చూడాలన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా రావాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరుకాకుండా ఆ కుర్చిని ఖాళీగా ఉంచడం సభకు శోభ తెస్తుందా? అని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయన విజ్ఞానం రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. మేడిగడ్డపై విచారణ జరుగుతోందని, కొన్ని నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టే వీలుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా కాకుండానే విపక్షం పిల్లి శాపనార్థాలు పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు నిచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజా ప్రయోజనం కోసం విపక్షం సలహాలు, సూచనలివ్వాలని కోరారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉద్యమ సమయంలోనే టీజీగా రాసుకున్నారు ‘తెలంగాణ రాష్ట్రానికి సూచికగా టీజీ అక్షరాలు ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష. ఉద్యమ సమయంలో యువత రక్తంతో దీన్ని రాసుకుంది. తర్వాత టీజీని కేంద్రం నోటిఫై చేసినా బీఆర్ఎస్ విస్మరించింది. బీఆర్ఎస్ సర్కార్ దానిని టీఎస్‌గా మార్చడం వారి అహంకారానికి ప్రతీక. అయితే దీన్ని మేము టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాచరికపు ఆనవాళ్ళను స్ఫురింపజేసేలా బీఆర్ఎస్ సర్కార్ అధికార చిహ్నం రూపొందిస్తే, మేం దాన్ని ప్రజాస్వామ్య చిహ్నంగా మార్చాం. అలాగే దళిత బిడ్డ రాసిన తెలంగాణ ఉద్యమ గీతం ‘జయ జయహే తెలంగాణ’కన్పించకుండా కేసీఆర్ సర్కార్ కుట్ర చేసింది. కానీ మా సర్కార్ దాన్ని రాష్రీ్టయ గీతంగా ఆమోదించింది..’అని సీఎం చెప్పారు. ప్రజాపాలనపై సత్యదూరమైన ఆరోపణలు ‘ప్రజాపాలనపై విపక్షం సత్యదూరమైన ఆరోపణలు చేస్తోంది. ప్రతి మంగళవారం, శుక్రవారం మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పినదాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 12 శాఖలకు చెందిన 21 మంది అధికారులను అందుబాటులో ఉంచాం. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో అవకతవకల వల్లే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మేము మేనేజ్మెంట్ కోటా కింద వచ్చిన వాళ్ళం కాదు. ప్రజాక్షేత్రం నుంచి వచ్చాం. అందుకే ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే ప్రగతి భవన్ కంచెలు తొలగించాం. కాళోజీ కవిత్వం గురించి చెప్పే బీఆర్ఎస్ నేతల పాలనలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి కాలేదు..’అని రేవంత్ ప్రశ్నించారు. ఇక మొదటి తేదీనే జీతాలు ‘మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వం దివాలా తీసిందనడం ఏమిటి? పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపోతుందా? ఉద్యోగులు, పెన్షనర్లకు 25వ తేదీ దాకా జీతాలు ఇవ్వలేని చరిత్ర వాళ్ళది. మేము 4వ తేదీలోగానే జీతాలు ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మొదటి తేదీనే ఇస్తాం. రైతు బంధు వేయడం లేదంటూ విపక్షం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 2018–19లో యాసంగి రైతుబంధు వేయడానికి 5 నెలలు, 19–20లో 9 నెలలు, 20–21లో 4 నెలలు, 22–23లో 4 నెలలు తీసుకున్నారు. ఇలాంటి వాళ్లు మమ్మల్ని విమర్శించడం ఏమిటి? పెన్షన్లు 80 శాతం చెల్లించాం. మిగిలినవి 15వ తేదీలోగా చెల్లిస్తాం..’అని రేవంత్ తెలిపారు. ఆటోరాముళ్ళ హైడ్రామా ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతోందంటూ వాళ్ళను రెచ్చగొట్టడం రాజకీయమే. జూనియర్ ఆరి్టస్టుల తరహాలో ఆటోరాముళ్ళు ఆటోలెక్కి అసెంబ్లీకి రావడం, ఆటోలో కూడా కెమెరా పెట్టడం ఓ హైడ్రామా. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే 15.21 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. రూ.535.52 కోట్లు ఆరీ్టసికి ఇచ్చాం. మహిళలు ఈ సదుపాయం వినియోగించుకుని గుళ్ళకు వెళ్ళడం వల్ల దేవాదాయ శాఖ ఆదాయం నవంబర్‌లో రూ.49.28 కోట్లు ఉంటే, డిసెంబర్లో రూ.93.24 కోట్లకు పెరిగింది. జనవరిలో కూడా రూ.68.69 కోట్ల ఆదాయం వచ్చింది..’అని సీఎం వివరించారు. గ్రూప్–1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్ళకు పెంచుతాం ‘ఉద్యోగాల కల్పన మా విధానం. మేం వచ్చిన రెండు నెలల్లోనే 6,956 స్టాఫ్ నర్సుల నియామకం, సింగరేణిలో 441 కారుణ్య నియామకాలు చేపట్టాం. త్వరలోనే 15 వేల పోలీసు నియామకాలు చేపడతాం. గ్రూప్–1 పరీక్షల వయోపరిమితిని 46 ఏళ్ళకు పెంచి నియామకాలు చేపడతాం. పాలక మండలి రాజీనామా చేయకపోవడం వల్లే ఆలస్యం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చిందో చెప్పాలి. మైనార్టీలకు పెద్దపీట వేసిన వైఎస్ సీఎం పేషీలో మైనారీ్టలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పీట వేశారు. ఆ సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. కేసీఆర్ పాలనలో వాళ్ళ కుటుంబ సభ్యులకే కారుణ్య నియామకాలు దక్కాయి. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం చేపడతాం. ప్రొఫెసర్ జయశంకర్ పేరు చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు, తాను పుట్టిన ఊరును రెవెన్యూ గ్రామం చేయాలన్న ఆయన చివరి కోరికను కూడా పట్టించుకోలేదు. మేము దాన్ని నెరవేర్చాం. ఆదివాసీల పోరాట యోధుడు కొమరం భీంను కూడా విస్మరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వారి వారసులను ఆదుకుంది. ఇంద్రవెల్లి అమర వీరులను కూడా ఆదుకున్నాం. కవి గూడ అంజన్న చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించ లేదు. ప్రగతి భవన్ వద్ద గద్దర్ మూడు గంటల పాటు నిరీక్షించేలా చేశారు. మేము ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తుండేలా ఆయన పేరుతో పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది ఎవరు..’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలపై వాగ్వాదం కృష్ణా జలాలపై కేంద్రానికి అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ రేవంత్ చేసిన విమర్శ సభలో వాగ్వాదానికి దారి తీసింది. కృష్ణా బోర్డు వద్ద సంతకాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీశారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టులపై అధికారం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపిందంటూ బోర్డ్ మినిట్స్‌ను ఆయన ప్రస్తావించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బదులిస్తూ తాము దాన్ని వ్యతిరేకించామని, అధికారులు కేంద్రానికి లేఖ కూడా ఇచ్చినట్టు తెలిపారు. బోర్డు నిర్ణయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే అంగీకరించి బడ్జెట్లో నిధులు కూడా ఇచ్చిందని అన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే నిధులు ఇస్తామని చెప్పామని, అది జరగలేదు కాబట్టే నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు బదులిచ్చారు. ఆ తర్వాత సభ శనివారానికి వాయిదా పడింది. -
శివ బాలకృష్ణ అరెస్ట్ తో HMDA అధికారుల్లో టెన్షన్
-
మేడిగడ్డ దగ్గర టెన్షన్ వాతావరణం
-
కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీపై కేంద్రం ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కమిటీ
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానున్నారు. రేపు(మంగళవారం) కాళేశ్వరం డ్యామ్‌ను కేంద్ర బృందం సందర్శించనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం నివేదిక సమర్పించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. చదవండి: సీఎం కేసీఆర్ ధైర్యం అదేనా? -
పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన