- ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
కాటారం(మల్హర్): మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా మంథని ప్రాంతమే కాకుండా తెలంగాణలోని ఐదు జిల్లాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం మల్హర్ మండలం కొయ్యూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఈప్రాంతం సస్యశ్యామలంగా మారనుందని అన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.ప్రతిపక్షాలు ప్రాజెక్టు నిర్మాణంపై రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మిషన్ భగీరత ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్న దఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు.