అప్పటికల్లా కాళేశ్వరం బరాజ్‌లలో నీరు నింపాలి
లేకపోతే మేమే 50 వేల మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తాం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
గోదావరి నిండుగా పారుతున్నా ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపాటు
పార్టీ నేతలతో కలిసి మేడిగడ్డ బరాజ్ పంప్‌హౌస్‌ల సందర్శన
సాక్షి ప్రతినిధి, వరంగల్/గోదావరిఖని: గోదావరి నిండుగా పారుతున్నా కన్నెపల్లి (మేడిగడ్డ (లక్ష్మీ)) పంపుహౌస్ నుంచి నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం (క్రిమినల్ నెగ్లిజెన్సీ) ప్రదర్శిస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. దేశం గర్వించే విధంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నామ్ చేయాలనే రాజకీయ దురుద్దేశంతో రైతులకు నష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఆగస్టు 2 వరకు కాళేశ్వరం బరాజ్‌ల్లో నీరు నింపాలని, లేదంటే 50 వేల మంది రైతులతో తరలివచ్చి తామే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం బరాజ్‌ల సందర్శనకు బయలుదేరి గురువారం రాత్రి గోదావరిఖని ఎనీ్టపీసీ జ్యోతిభవన్‌లో బస చేసిన కేటీఆర్..శుక్రవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, మేడిగడ్డ బరాజ్‌లను, పంపుహౌస్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో మీడియాతో మాట్లాడారు
ప్రభుత్వానికి నీళ్లిచ్చే ఉద్దేశం లేదు..
‘రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం లేదు. డిసెంబర్–జనవరిలలోనే నీరివ్వాలని ప్రభుత్వానికి సూచించినా భేషజాలకు వెళ్లి యాసంగి పంటలను ఎండబెట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, సింగూరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఎండిపోతున్నా కేవలం రాజకీయ దురుద్దేశంతో వాటిని నింపే ప్రయత్నం చేయడం లేదు. వానాకాలంపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితిని కలి్పస్తున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
70–80 టీఎంసీలు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా..
‘తెలంగాణలో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 70–80 టీఎంసీల నీరు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలేరు, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, ఆదిలాబాద్, హుజూరాబాద్, హుస్నాబాద్, గజ్వేల్, భువనగిరి.. ఇలా తెలంగాణలోని మెట్ట ప్రాంతాల కు సాగునీరు అందించే అవకాశం ఉంది.
ఇందుకోసం రోజు కు రెండు, మూడు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తే మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లను గోదావరి నీటితో నింపొచ్చు. పైన ఉన్న సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లలోనూ నీళ్లు లేవు, వీటికీ కాళేశ్వరమే ఆధారం. మరో ప్రత్యామ్నా యం లేదు. ఇవన్నీ తెలిసినా రాజకీయం కోసం రైతులు, ప్ర జలను వంచిస్తున్నారు..’అని మాజీమంత్రి ధ్వజమెత్తారు.
ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు ఓ ఫార్స్
‘నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) రిపోర్టు ఓ ఫార్సు. ఆ నివేదికను సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఐదేళ్లు గడు స్తున్నా ఇంకా రిపోర్టు ఇవ్వలేదు. కాళేశ్వరంపై మాత్రం కనీసం ప్రాజెక్టును పరిశీలించకుండా ఒక్కరోజులోనే నివేదిక ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఒకే విధంగా ఉంది. కాళేశ్వరం జలాల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పంప్‌హౌస్‌లు ఆన్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజనీర్లు చెప్పారు. నీటిని లిఫ్ట్ చేస్తే రెండు రోజుల్లో మిడ్ మానేరుకు చేరుకుంటాయి.
దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉదయం గోదావరిఖని నుంచి చెన్నూరు మీదు గా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లిన కేటీఆర్ దారిలో గోదావరి బ్రిడ్జి వద్ద కొద్దిసేపు ఆగి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడ వరద లేకపోవడంతో..ప్రస్తుత ప్రభుత్వ తీరుతో గోదావరి నదిలో చిల్లర నాణేలు సమరి్పంచేందుకు నీరు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ వెంట బీఆర్‌ఎస్ నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వ ర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్, గోరటి వెంకన్న, వాణిదేవి, ఎలగందుల రమణ, బాల్క సుమన్, దివాకర్‌రావు, చిన్నయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, ముఠా గోపాల్, కోవ లక్ష్మీ, విజయుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment