సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం | CM Revanth Reddy To Visit Medigadda Project | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Published Sat, Feb 10 2024 12:11 PM | Last Updated on Sat, Feb 10 2024 2:19 PM

CM Revanth Reddy Visit to Medigadda - Sakshi

సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నెల 13వ తేదీన మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ పర్యటనలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రాజెక్టు సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ను ఆహ్వానించే భాద్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. 

అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 12వ తేదీతో ముగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో ఇరిగేషన్‌పై చర్చ జరగనుంది. విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. ఈ నెల 13న చేపట్టనున్న మేడిగడ్డ సందర్శనకు అటు.. బీజేపీ నేతలు కూడా సై అంటున్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రాజెక్టును సందర్శిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. 

మేడిగడ్డ  ప్రాజెక్టులో వరదలు కారణంగా డ్యామేజ్‌ జరగలేదని మానవ తప్పిదం వల్లే డ్యామేజ్‌ జరిగిందని విజిలెన్స్‌ ఇటీవల అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. కాంక్రీట్‌, స్టీల్‌ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్‌.. ఒకటి నుంచి ఐదో పిల్లర్‌ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్‌ డేటాను విజిలెన్స్‌ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్‌ చేతికి శాటిలైట్‌ డేటా రానుంది.

ఇదీ చదవండి: Vote for Crore : ఓటుకు కోట్లు కేసులో సుప్రీం నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement