ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఏ ప్రాజెక్టు పూర్తి కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్కు భూమిపూజ చేశారు.
కాళేశ్వరం : ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఏ ప్రాజెక్టు పూర్తి కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్కు భూమిపూజ చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఎవరూ ఆపలేరని, ప్రాజెక్ట్లో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఒక్కోచోట ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మహారాష్ట్రలో ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం కేసీఆర్ కన్నెపల్లి వద్ద పంప్‌హౌజ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్పీకర్ ముధుసుదనా చారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.