కాళేశ్వరం ప్రాజెక్ట్కు భూమిపూజ
కరీంనగర్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దంపతులు సోమవారం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్కు భూమిపూజ చేశారు. నీటి టి కరువుతో అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ఆయన నేడు శ్రీకారం చుట్టారు. ఉదయం 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 12 లక్షల స్థిరీకరణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంటోంది.
2017 నాటికి మెజార్టీ పనులను పూర్తి చేసి మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు పనులను పూర్తి చేసి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం సంకల్పించింది. కాగా ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న నీటి లభ్యత, అంతర్రాష్ట్ర సమస్యలు, ఆయకట్టు లక్ష్యాలు ఇప్పటికే కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే.