మరమ్మతులపై కేబినెట్ భేటీలో చర్చించాలి
మంత్రులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండగా, ఆలోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతుతపై రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు.
బ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించాలా? ఇతర ప్రత్యా మ్నాయాలు ఏమైనా ఉన్నాయా? బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలి? అనే అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి నిర్ణ యాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
త్వరలో కాళే శ్వరం బ్యారేజీలు, వాటికి సంబంధించిన పంప్ హౌస్‌లను పరిశీలి స్తామని వెల్లడించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో సీఎం, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మ ల నాగేశ్వ రరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
నిపుణుల కమిటీ సిఫారసులు వివరించిన ఉత్తమ్
గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పలుమార్లు బుంగలు పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బ్యారేజీలకు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులను, తీసుకోవాల్సిన రక్షణ చర్యలను సిఫారసు చేసింది. ఈ అంశాలన్నిటినీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సీఎం, ఇతర మంత్రులకు వివరించారు.
2019లోనే బ్యారేజీలు ప్రమాద సంకేతాలు వెలువరించాయని, ఇప్పుడు మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు ఉండదనే అంశాన్ని తోసిపుచ్చలేమని నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్టుగా మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment