మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై రాష్ట్రానికి ఎన్డీఎస్‌ఏ స్పష్టికరణ
మూడు బరాజ్‌ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ నిర్మాణమే
ఇప్పటికిప్పుడు నీటిని నిల్వ చేస్తే దిగువ ప్రాంతాలకు పెనుముప్పు అవకాశాలు
తుది నివేదిక కోసం డిసెంబర్ వరకు ఆగండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ సహా అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో ఇప్పటికిప్పుడు నీటిని నిల్వ చేయడం ప్రమాదకర మని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఈ మూడు బరా జ్‌ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ నిర్మాణం జరిగినందున నీటిని ఏమాత్రం నిలువచేసినా బరాజ్‌ల మనుగడకే ముప్పని వెల్లడించింది. ప్రస్తుతం దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌లో వినియోగించిన సాంకేతికతనే మిగతా బరాజ్‌ల్లో నూ వినియోగించినందున ప్రమాదాలకు ఆ స్కారం ఉందని వివరించింది. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఈఎన్సీలు అనిల్, నాగేందర్‌రావు, సుధాకర్ రె డ్డిలు శుక్రవారం ఎన్డీఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్ తో పాటు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీతో సమావేశమయ్యా రు. బరాజ్‌లకు సంబంధించి ఎన్డీఎస్‌ఏ సమర్పించాల్సిన తుది నివేదికలపై చర్చించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు సూచించండి: మంత్రి ఉత్తమ్
ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బరాజ్ నుంచి నీటి ఎత్తిపోసే అవకాశం లేనందున, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ మినహా ఇతర బరాజ్‌ల నుంచి ఎల్లంపల్లి, మిడ్ మానేరుకు నీటి ఎత్తిపోతలపై ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని కోరారు. దీనిపై ఎన్డీఎస్‌ఏ అధికారులు స్పందిస్తూ.. మిగతా బరాజ్‌ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ సాంకేతికతనే వినియోగించినందున ప్రమాదాలకు అవకా శం ఉందని, దిగువన ఉన్న సమ్మక్క సారక్క బరాజ్ సహా భద్రాచలం ఆలయం వరకు పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసినట్టు తెలిసింది.
దీనిపై అన్ని అంశాలను విశ్లేíÙంచి డిసెంబర్ లోగా తుది నివేదికను సమరి్పస్తామని, అప్పటిలోగా ఎలాంటి నీటి నిల్వ చేయొద్దని సూచించినట్టు సమాచారం. దీంతో తుది నివేదిక సత్వరమే వచ్చేలా చూడాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బరాజ్‌లకు తాత్కాలిక మరమ్మతులు చేసిందని చెప్పారు.
ప్రభుత్వ చిత్తశుద్ధి భేష్: ఎన్డీఎస్‌ఏ
తాత్కాలికంగా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద చిన్న తరహా నిర్మాణాన్ని చేసుకుని రాష్ట్ర రబీ, తాగునీటి అవసరాలకు అక్కడి నుంచి నీటిని తరలించుకునే అవకాశాలు సూచించాలని మంత్రి ఉత్తమ్‌తో పాటు రాష్ట్ర అధికారులు కోరినట్టు తెలిసింది. లక్ష కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి చెప్పినట్లు సమాచారం. దీనిపై ఎన్డీఎస్‌ఏ స్పందిస్తూ.. గతంలో బరాజ్ నిర్మాణ సంస్థతో పాటు ప్రభుత్వం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కారణంగానే బరాజ్‌లను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందని, తాము తుది అభిప్రాయం వెల్లడించే వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టును వీలైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చే విషయంలో మంత్రి, ప్రభుత్వ చిత్తశుద్ధిని అభినందించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment