కొనసాగిన ధార్మిక పరిషత్‌ కమిటీ విచారణ | Continued Dharmika Parishad Committee Inquiry | Sakshi
Sakshi News home page

కొనసాగిన ధార్మిక పరిషత్‌ కమిటీ విచారణ

Published Fri, Jul 21 2023 4:34 AM | Last Updated on Fri, Jul 21 2023 10:40 AM

Continued Dharmika Parishad Committee Inquiry - Sakshi

తిరుపతి కల్చరల్‌: హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న సమ­యంలో అర్జున్‌దాస్‌ పలు అక్రమాలకు పాల్పడినట్లు వ­చ్చి­న ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్‌ కమిటీ సభ్యులు ఏబీ కృష్ణారెడ్డి, జోలా చైతన్య, శ్రీరామ­మూర్తి, విజయరాజు, రామకృష్ణారెడ్డి రెండో రోజు కూడా విచారణ నిర్వహించారు. అర్జున్‌దాస్‌ గురువారం కూ­డా విచారణకు హాజరవ్వలేదు. అయితే విచారణ కమిటీ సభ్యు­లు మఠంలోని రికార్డులను నిశితంగా పరిశీలించా­రు.

రికార్డుల్లోని లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ పూజారు­లు అర్జున్‌దాస్‌ వల్ల తాము పడిన ఇబ్బందులను విచారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మఠం భూముల విషయంలో అర్జున్‌దాస్‌ చేసిన అక్ర­మా­లను పలువురు కమిటీకి విన్నవించారు. అనంతరం విచారణ కమిటీ సభ్యుడు ఏబీ కృష్ణారెడ్డి మీడియా­తో మాట్లాడుతూ విచారణకు అర్జున్‌దాస్‌ సహకరించట్లే­ద­ని చెప్పారు. అర్జున్‌దాస్‌పై పలువురు ఇచ్చిన ఫిర్యా­దుల­ను స్వీకరించామని తెలిపారు. పూర్తిస్థాయిలో విచార­ణ జరిపిన అనంతరం నివేదిక సమరిస్తామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement