సాక్షి, న్యూఢిల్లీ: అధికార సాధనే థీమ్‌గా ఎలక్షన్ టీమ్‌ను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో 25 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ మేరకు గురు వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రదేశ్ ఎన్నికల కమిటీలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీమంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామో దర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, ఎమ్మె ల్యేలు జగ్గా రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేతలు రేణుకా చౌదరి, అజారుద్దీన్, మహేశ్‌కుమార్ గౌడ్, ప్రేమ్‌సాగర్ రావు, సునీతా రావులను సభ్యులుగా నియమించారు.యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, సేవాదళ్ రాష్ట్ర ముఖ్య నిర్వాహకుడు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment