Gyanvapi Case: Allahabad High Court Allows ASI Survey Of Mosque - Sakshi
Sakshi News home page

Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు

Published Thu, Aug 3 2023 10:55 AM | Last Updated on Thu, Aug 3 2023 12:21 PM

Gyanvapi Case: Allahabad High Court Allows ASI Survey Of Mosque - Sakshi

అలహాబాద్‌: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను వెంటనే ప్రారంభించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ గత నెలలో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ  మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 

న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ.. అంజుమన్‌ ఇంతేజామియా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

కాగా కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా లేదా అనేది తెలుసుకునేందుకు మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు జూలై 21న అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా  శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్నిఆదేశించింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. దీంతో భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది.

దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెషన్స్‌ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది.  దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధిస్తూ.. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. సుప్రీం ఆదేశాలతోప్రారంభమైన కొన్ని గంటల్లోనే సర్వే నిలిచిపోయింది.

వారణాసి కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జూలై 27న విచారణ చేపట్టగా.. ఆగస్టు 3న తీర్పు వెల్లడించే వరకు సర్వే చేపట్టరాదని స్టే విధించింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్‌ఐకి అనుమతినిచ్చింది. 
చదవండి: ‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం

#WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement