
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర కొత్త పదాధికారుల కమిటీ ఏర్పాటైంది. 40 మందితో కూడిన నూతన కమిటీని బీజేపీ ప్రకటించింది. 10 మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు,10 మంది కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ట్రెజరర్, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శితో జాబితా విడుదలయ్యింది. కమిటీలో అధ్యక్షుడు సోము వీర్రాజు తన మార్కు చూపించారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారికే కమిటీలో చోటు లభించింది. జంబో కమిటీకి సోము వీర్రాజు స్వస్తి పలికారు. గత కమిటీలో 30 మంది అధికార ప్రతినిధులు ఉండగా, ఆ జాబితాను 6కు కుదించారు.(చదవండి: హిందుత్వం అప్పుడు గుర్తుకురాలేదా..?)