కడియం నర్సరీల అభివృద్ధికి ప్రభుత్వం అభివృద్ధి కమిటీని నియమించిందని రాష్ట్ర ఉద్యానవనశాఖ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): కడియం నర్సరీల అభివృద్ధికి ప్రభుత్వం అభివృద్ధి కమిటీని నియమించిందని రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక సిటిఆర్‌ఐ సెమినార్ హాల్లో కడియం నర్సరీ అభివృద్ధి కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ చిరంజీవి చౌద రి మాట్లాడుతూ కడియం నర్సరీ అభివృద్ధి కమిటి చైర్మన్‌గా ఉద్యానవనశాఖ రాష్ట్ర కమిషనర్, జిల్లా కలెక్టర్ కో-చైర్మన్‌గా, సభ్యులుగా హార్చికల్చర్ డిప్యూటి డెరైక్టర్ , అర్బన్ గ్రీన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఎండి, ఉద్యానవనశాఖ డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్, సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉద్యానవనశాఖ అసిస్టెంట్ డెరైక్టర్లుంటారన్నారు.
రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. సమావేశంలో నర్సరీ రైతుల సమస్యలు తెలుసుకుని ప్రణాళికను తయారుచేసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కడియం నర్సరీ ఉత్పత్తులలను వివిధ మార్కెట్‌తో టయప్ చేయడానికి, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చర్చించారన్నారు. కడియం ప్రాంతంలో సుమారు 1700 నర్సరీలు ఉన్నాయని, నర్సరీ రైతులు మట్టితోపాటు కొబ్బరిపొట్టు కలిపి వినియోగించుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు. ఉద్యానవనశాఖ ద్వారా రాష్ట్రంలో 130 పార్టబుల్ రైపనింగ్‌సెంటర్లు, ఉద్యానవన శాఖ సబ్సిడీపై రైతులు 222 రైపనింగ్ సెంటర్లు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 23 రైపనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
సర్ ఆర్ధర్‌కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు, నర్సరీ రైతులు మార్గాని సత్యనారాయణ, మార్గానిగోవిందు, పుల్లా రామకృష్ణ, పులా ్లవీర్రాజులు మాట్లాడుతూ నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్తుతోపాటు, ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు టాక్స్‌లేకుండా చూడాలని, విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయాలని, నష్టాల సమయంలో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అర్బన్ గ్రీన్ డెవలప్‌మెంట్ అధారిటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.చంద్రమోహనరెడ్డి, ఉద్యానవనశాఖ డెరైక్టర్ ఆఫ్‌రీసెర్చ్ దిలీప్‌బాబు, ఆల్ ఇండియా నర్సరీమెన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లా వీరవెంకట్రావు, మైక్రోఇరిగేషన్ పీడీ సుబ్బారావు, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు నర్సరీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.