
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్‌మైదాన్‌లో.. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు, సూచనలు ఇచ్చేందుకు నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. (125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం)
- ఇప్పటి వరకు స్వరాజ్ మైదానానికి ఉన్న పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌గా మార్చారు. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ రాంజీ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.
- ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ కింద ఉన్న 20 ఎకరాల మైదానాన్ని సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించాల్సిందిగా ఆదేశించారు.
- మొత్తం ప్రాంతాన్ని మరింత బాగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటారు. అందులో పార్కు, గార్డెన్, తోట పనులు ఉంటాయి. ఇప్పుడు స్వరాజ్ మైదానంలో జరుగుతున్న అన్ని సాంప్రదాయ కార్యకలాపాలు కొనసాగుతాయి.
- ఏపీఐఐసీ ఈ ప్రాజెక్టుకోసం ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అవుతుంది.
కమిటీ వివరాలు..
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా, కమిషనర్ మెంబరు కన్వీనర్‌గా, ఎడ్యుకేషన్ మినిస్టర్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కార్యదర్శి, ఫైనాన్స్ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. (అంబేడ్కర్‌కి ఆంధ్రలో ‘పరీక్ష’?!)
Comments
Please login to add a commentAdd a comment