న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటిదాకా 5,000 పై చిలుకు సలహాలు, సూచనలు అందినట్టు సమాచారం. కమిటీ దీనిపై గతవారం సలహాలను ఆహా్వనించడం తెలిసిందే. జనవరి 15 దాకా అందే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
గత సెపె్టంబర్లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటిదాకా రెండుసార్లు సమావేశమైంది. జమిలి ఎన్నికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆరు జాతీయ, 33 గుర్తింపు పొందిన పారీ్టలకు లేఖలు రాసింది. లా కమిషన్‌తో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంది. జమిలి ప్రతిపాదనను, కోవింద్ కమిటీ ఏర్పాటును కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment