ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి | committee should be formed in each school to determine the fees | Sakshi
Sakshi News home page

ప్రైవేటు స్కూలు ఫీజుల వివరాలు వెబ్‌లో ఉంచాలి

Published Sat, Sep 2 2023 3:23 AM | Last Updated on Sat, Sep 2 2023 4:03 PM

committee should be formed in each school to determine the fees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు స్కూళ్ళల్లో విద్యా­ర్థుల నుంచి వసూలు చేసే ఫీజులు పారద­ర్శకంగా ఉండాలని ప్రభుత్వం సూ­చించింది. ఇందుకు సంబంధించి శుక్రవా­రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 1994లో వచ్చిన జీవో 1లో ఉన్న నిబంధనలే దాదాపు పొందు పర్చినప్పటికీ, ప్రైవేటు స్కూళ్ళు వసూలు చేసే ఫీజులను సంబంధిత స్కూల్‌ వెబ్‌సైట్‌లో అందిరికీ అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ కార్య­దర్శి వాకాటి కరుణ విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఈ ఫీజుల వివ­రాలను విద్యాశాఖకు పంపించాలని పేర్కొ­న్నారు. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నిర్థారణకు ప్రతి స్కూలులోనూ కమిటీ ఏర్పాటు చేయా­లని, ఇందులో విద్యా సంస్థ ని­ర్వాహకుడు లేదా కరస్పాండెంట్‌ అధ్యక్షు­డుగా ఉండా­లని సూచించారు. స్కూల్‌ ప్రిన్సి­పల్, ఉపా­ధ్యాయుల్లో ఒకరు, పేరెంట్స్‌ ఆ క­మి­టీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు.

ఏడాదిలో మూడుసార్లు కమిటీ సమావేశమవ్వాలి
ఈ తరహాలో ఏర్పడిన పాలక మండలి ఏడా­దిలో మూడు సార్లు సమావేశమై, పాఠశాల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించాలని సూచించారు. ఏడాదిలో స్కూల్‌ విద్యార్థులు, పాఠ­శాల అభివృద్ధికి చేసే ఖర్చును ఆడిట్‌ చేయించి, ఈ వ్యయం ఆధారంగా ఫీజులు వసూ­లు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొ­న్నారు.

మొత్తం ఫీజులో యాజమాన్య ఆదా­యం 5 శాతం, స్కూల్‌ నిర్వహణకు 15 శాతం, పాఠశాల అభివృద్ధికి 15 శాతం, ఉపాద్యాయుల జీతా­లకు 50 శాతం, పాఠశాల ఉద్యో­గుల గ్రా­ట్యుటీ, పీఎఫ్, గ్రూప్‌ ఇన్సూ­రెన్స్‌ వంటి వాటికి 15 శాతం వసూలు చేసేందుకు వీలు కల్పించారు. పాఠశాల ఆదాయ వ్యయ వివ­రాలను విధిగా గుర్తింపు కలిగిన ఆడిటర్‌ చేత ఆడిట్‌ చేయించి, విద్యాశాఖకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement