
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కమిటీ
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది.
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు బాధితులందరికీ డబ్బు చెల్లించేలా ఉమ్మడి హైకోర్టు ముందడుగు వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని హైకోర్టు నిర్ణయించింది. సభ్యుల పేర్లు సూచించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది.
డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు విధివిధానాలను కమిటీ రూపొందిస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. అలాగే ఈ కేసులో తమకు సూచనలు, సలహాలు కూడా ఇస్తుందని తెలిపింది. హైకోర్టు నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.