common high court
-
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కమిటీ
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు బాధితులందరికీ డబ్బు చెల్లించేలా ఉమ్మడి హైకోర్టు ముందడుగు వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని హైకోర్టు నిర్ణయించింది. సభ్యుల పేర్లు సూచించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది. డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు విధివిధానాలను కమిటీ రూపొందిస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. అలాగే ఈ కేసులో తమకు సూచనలు, సలహాలు కూడా ఇస్తుందని తెలిపింది. హైకోర్టు నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట
హైదరాబాద్: వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్పీకర్ కు ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున మాట్లాడలేనని అన్నారు. -
'పార్లమెంటరీ సెక్రటరీలను ఉపసంహరించుకుంటున్నాం'
హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్ పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ సర్కారు నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్‌గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్ పదవులు కోల్పోయారు. -
టీ-సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
టీఆర్ఎస్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ సర్కారు నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి నియామకాలు హైకోర్టు అనుమతితో జరపాలని ఆదేశించింది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాల్చింది. హైకోర్టు తీర్పుతో పార్లమెంటరీ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టిన వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, గాదరి కిశోర్ కుమార్, సతీశ్ కుమార్, కోవాల లక్ష్మి పదవులు కోల్పోనున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన సంగతి తెలిసిందే. వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్‌గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్లకు సీఎం కార్యాలయ శాఖలు కేటాయించారు. వీరికి సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
హైకోర్టు విభజనలో మరో ట్విస్ట్
హైకోర్టు విభజన అంశం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణలోనే ఉన్నందున ఏపీ ప్రభుత్వమే మరోచోట హైకోర్టు నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని సోమవారం ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు చేయాలని, ఈ మేరకు అనువైన స్థలాన్ని ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. కొత్త హైకోర్టు ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలపై గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మీవల్ల కాకపోతే మేమే చర్యలు తీసుకుంటాం
-
మీవల్ల కాకపోతే మేమే చర్యలు తీసుకుంటాం
హైదరాబాద్: అక్రమ హోర్డింగ్ ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు తలంటేసింది. రోడ్లపై ప్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది. మీకు సాధ్యం కాకపోతే తామే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. ఎల్లుండి(బుధవారం) లేగా నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. నివేదిక ఇవ్వకుంటే జిల్లా జడ్జీలతో కమిటీలు ఏర్పాటు చేస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
ఉమ్మడి హైకోర్టు సెలవులివీ..
-
సుప్రీం నోటిఫై చేసేవరకు ఉమ్మడి హైకోర్టే
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనను సుప్రీంకోర్టు నోటిఫై చేసే వరకు ఉమ్మడి న్యాయస్థానంగానే కొనసాగుతుందని హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టుకు అప్పటి వరకు రెండు రాష్ట్రాలపై న్యాయపరిధి ఉంటుందని, ఇరు రాష్ట్రాల కేసులను విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులెవరూ తిరిగి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసులను విచారించే న్యాయ పరిధిపై సింగిల్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. అంతేకాక న్యాయమూర్తులు తిరిగి ప్రమాణం చేసే విషయంలోనూ ధర్మసందేహం లేవనెత్తారు. దీనిపై ఆయన కేంద్రప్రభుత్వ వివరణను సైతం కోరారు. ఈ విషయాన్ని ఓ న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం ఈ కేసును జస్టిస్ నరసింహారెడ్డి వద్ద నుంచి తమ బెంచ్‌కు బదిలీ చేసుకుని విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం బుధవారం తీర్పు వెలువరించింది.