
మీవల్ల కాకపోతే మేమే చర్యలు తీసుకుంటాం
హైదరాబాద్: అక్రమ హోర్డింగ్ ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు తలంటేసింది. రోడ్లపై ప్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది. మీకు సాధ్యం కాకపోతే తామే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది.
ఎల్లుండి(బుధవారం) లేగా నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. నివేదిక ఇవ్వకుంటే జిల్లా జడ్జీలతో కమిటీలు ఏర్పాటు చేస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.