
టీఆర్ఎస్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ సర్కారు నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి నియామకాలు హైకోర్టు అనుమతితో జరపాలని ఆదేశించింది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా
సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాల్చింది.
హైకోర్టు తీర్పుతో పార్లమెంటరీ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టిన వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, గాదరి కిశోర్ కుమార్, సతీశ్ కుమార్, కోవాల లక్ష్మి పదవులు కోల్పోనున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన సంగతి తెలిసిందే. వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్లకు సీఎం కార్యాలయ శాఖలు కేటాయించారు. వీరికి సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.