
'అదనపు సౌకర్యాలు ఆపేయండి'
హైదరాబాద్: పార్లమెంట్ సెక్రటరీలకు ఇస్తున్న అదనపు సౌకర్యాలను నిలిపి వేయాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ సీఎం కార్యాలయ అధికారులను కలిశారు. పార్లమెంట్ సెక్రటరీల నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వయంగా అధికారులకు అందజేశారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమలు చేయాలన్నారు. లేదంటే కోర్టు ధిక్కార కేసు పెడతామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ సర్కారు నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం ఈనెల 1న ఆదేశాలిచ్చింది. పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి నియామకాలు హైకోర్టు అనుమతితో జరపాలని ఆదేశించింది.